బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున బదులు ఆ యంగ్ హీరో.!

-

అక్కినేని నాగార్జున  బిగ్ బాస్ షో ను వదిలి పెడుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాను నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ కూడా అనవసర విషయాలు వదిలి సినిమాల మీద ద్యాస పెట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం గతంలో ఓకే తరం హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున అందరూ ఇప్పటికి కూడా తమ దైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. వీరిలో నాగార్జున తప్ప మిగిలిన అందరూ సక్సెస్ ట్రాక్ లో వున్నారు.

నాగార్జున మాత్రం ఇప్పటికీ ఫ్లాప్ ల నుండి బయటకి రావటం లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తరువాత నాగ్ కు మంచి హిట్ రాలేదు. ఎంతగా కష్టపడుతున్నా గాని   సక్సెస్ అందుకోలేకపోతున్నారు.ఈ ఏడాది సంక్రాంతి కి’బంగార్రాజు సినిమా విడుదల అయ్యింది. అది పెద్దగా  విజయం సాధించలేదు. ‘ది ఘోస్ట్’ సినిమాను కూడా కష్టపడి మంచి ఏక్షన్ సినిమాగా తీశారు. కాని ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.

దీంతో నాగార్జున అలోచనలో పడ్డారు.  ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 కు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఆయన బిగ్ బాస్ వల్ల సినిమాలకు అన్యాయం చేస్తున్నాను అనే ఫీలింగ్ లో ఉన్నాడట. దీంతో వచ్చే సీజన్ కి కొత్త హోస్ట్ ఎంపిక కోసం నిర్వాహకులు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి పాన్ ఇండియా అంటూ హైప్ క్రియేట్ చేసి ప్లాప్ మూటగట్టు కున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ నాగార్జున ప్లేస్ భర్తీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news