తెలుగు బిగ్ బాస్ షో రాజు ఎలిమినేషన్ కరెక్టేనా.!

-

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు.ప్రస్తుతం ఈ వారంలో హౌస్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఒక్కరొక్కరిగా బిగ్ బాస్  హౌస్ లోకి వచ్చి ఆనంద పరచి వెళ్ళారు. తర్వాత మళ్లీ బిగ్ బాస్ షో ఎలిమినేషన్ మూడ్ లోకి వెళ్లి పొయింది.

ఇక నిన్నటి వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లో రాజు ఎలిమినేట్ అయ్యాడు. వాస్తవానికి రాజు రాజు ఎక్కడున్నా రాజే తరహాలో ఆడి అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఈ ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది.రాజ్ ఎలిమినేషన్ లాజిక్ లేకుండా అడ్డదిడ్డంగా చేశారని నెటిజన్స్ విరుచుకు పడుతున్నారు.

ఫైమా కంటే  రాజుకు ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ అతన్ని ఎలిమినేట్ చేశారు అనేది వీరి అరోపను.ఇది నిబంధనలకు విరుద్ధం అని,నామినేషన్స్ ఉన్న సభ్యుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని మాత్రమే ఎలిమినేట్ చేయాలనేది బిగ్ బాస్ లో రూల్ గా ఉందని. ఇక్కడ అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఫైమా ఎవిక్షన్ పాస్ తో సేవ్ అయ్యింది. ఆమె కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్ ని లెక్క ప్రకారం ఎలిమినేట్ చేయాల్సింది కాదు అని వారు వాదిస్తున్నారు. ఇక ఎలిమినేట్ అయిన రాజుకు బయట మాత్రం ఘన స్వాగతం లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news