దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం పది వేలు దాటాయి కరోనా కేసులు. ఇప్పటి వరకు భారత్ లో 10,363 మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 1211 మందికి కరోనా సోకగా 31 మందికి కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 339 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజుల నుంచి కాస్త తాగ్గాయి అనుకున్న కేసులు…
ఒక్కసారిగా భారీగా నమోదు అయ్యాయి. మూడు రోజుల క్రితం ఒక్క రోజే 1035 కేసులు నమోదు కాగా నేడు అత్యధికంగా 1200 కేసులు నమోదు కావడం భయపెట్టే అంశం. దీనిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. అటు మందు కూడా కనుక్కునే పరిస్థితి కనపడట౦ లేదు. లాక్ డౌన్ ప్రకటించినా సరే కేసులు ఈ విధంగా పెరగడం తో ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.