మద్యం దొరకక చాలా మందికి పిచ్చి ఎక్కే పరిస్థితి ఏర్పడింది. వేలాది మంది ఇప్పుడు మద్యం దొరక్క పిచ్చి ఆస్పత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఇది కొందరికి తీవ్ర సమస్య కాగా మరికొందరికి ఇది పెద్ద సమస్య. మద్యం పిచ్చితో కొందరు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళారు. పది మంది వరకు తెలంగాణాలో ఆత్మహత్య చేసుకున్నారు. కల్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ తరుణంలో సోషల్ మీడియాలో కొంత మంది సరదా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇలాగే టిక్ టాక్ లో వీడియో చేసి ఇరుక్కుపోయారు ఇద్దరు యువకులు. టిక్ టాక్ మోజులో పడిన హైదరాబాద్ కి చెందిన ఇద్దరు యువకులు కాస్త కొత్తగా ఆలోచించి… మందులేక బాధలు పడుతున్న మందుబాబులకు మద్యం పోస్తూ ఒక టిక్ టాక్ వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అది క్షణాల్లో వైరల్ అయింది.
వైరల్ కావడంతో తెలంగాణా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి వెళ్ళగా… ఆయన వారిపై సీరియస్ అయి చర్యలకు ఆదేశాలు జారీ చేసారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు.. అక్రమంగా మద్యం సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం తో… రంగంలోకి దిగిన సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు ఈది బజార్‌కు చెందిన యువకులు కుమార్ సంజూ, నితిన్‌లను అరెస్ట్ చేసి… ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34ఏ కింద కేసు పెట్టారు.