బిగ్ బ్రేకింగ్ ; ఏపీలో అన్ని ఎన్నికలు ఒకే రోజు…!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమైంది. త్వరలో ఎన్నికల సంఘం వీటిని పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ కూడా ఎన్నికలను త్వరగా పూర్తి చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. అటు రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. 59 శాతం రిజర్వేషన్ వద్దని స్పష్టంగా చెప్పింది హైకోర్ట్. దీనితో రిజర్వేషన్ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.

ఇక ఇదిలా ఉంటే ఎన్నికలను ఒకే రోజు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం భావిస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌తో పురపాలక, పంచాయతీరాజ్‌, పోలీసు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ స్థానాలకు ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈనెల 21న, పురపాలక సంఘాలకు ఈనెల 24న,

గ్రామ పంచాయతీలకు 27న వేర్వేరు తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చెయ్యాలని, రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధులు మార్చి నెలాఖరులోగా రావాలంటే అప్పటిలోగా ఎన్నికలు పూర్తి కావాలని సూచించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్‌ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల సంఘం ఈ నెల 25 న మొత్తం అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఒకే రోజు నిర్వహించాలని భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news