హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. అలా వ్యాధి నిర్ధారణ అయింది. వెంటనే ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర అధికారులతో సమావేశం అయ్యారు. మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయింది. వెంటనే వంద కోట్ల నిధులు హైదరాబాద్ లో హోర్డింగ్ లు. అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై ఎక్కడిక్కడ కఠిన చర్యలు తీసుకున్నారు. ఎవరిని కంగారు పడాల్సిన పని లేదని అన్నారు.
ఎవరికి అయితే వైరస్ సోకిందో సదరు వ్యక్తి కలిసిన వాళ్ళను గంటల్లో పట్టుకున్నారు. వాళ్లకు వైద్య పరిక్షలు నిర్వహించారు. అదే విధంగా ప్రత్యేక ఆస్పత్రికి కూడా శ్రీకారం చుట్టాలని భావించారు. మెట్రో, ఆర్టీసి బస్సులు, హైదరాబాద్ లో అన్ని కాలనీలు శానిటేషన్ చేసారు. నిజామాబాద్ లో అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రవేట్ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చారు. ఇలా ఎక్కడిక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇప్పుడు దీనిపై కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. కెసిఆర్ సర్కార్ భేష్ అంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో అప్రమత్తం కాలేదని చెప్పింది. కెసిఆర్ సర్కార్ నిర్ణయాలు రాష్ట్రాలకు ఆదర్శమని చెప్పింది. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్ళిన ఎంపీలతో కూడా కేంద్ర మంత్రులు మాట్లాడి అభినంధించినట్టు సమాచారం. మంచి నిర్ణయాలు తీసుకున్నారని, కట్టడి చెయ్యడంలో అప్రమత్తంగా వ్యవహరించారని కొనియాడింది కేంద్రం.