బిగ్ బ్రేకింగ్; తెలంగాణాలో మరో 32, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు…!

-

తెలంగాణాలో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణా 32 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 563 నమోదు అయ్యాయి. 17 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనిపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. రోజుకి వెయ్యి నుంచి 1100 కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పై రాత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. హైదరాబాద్ ను జోన్లు గా విభజించి ప్రత్యేక అధికారిని నియమించాలని, హైదరాబాద్ ని 17 యూనిట్లు గా విభజించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. పాజిటివ్ కేసులు ఉన్న కంటైన్మేంట్ లకు పక్కా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

ఒక్కో యూనిట్ కు వైద్య, పోలీస్, మున్సిపల్, రెవెన్యు సిబ్బందిని నియమించాలని సూచించారు. ప్రజలు ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని ఆయన హెచ్చరించారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. 9300 దాటాయి కేసులు. మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీనిపై కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. ప్రధాని కూడా కేబినేట్ సమావేశం నిర్వహించే అవకాశాలు.

Read more RELATED
Recommended to you

Latest news