వాహనదారులకు బిగ్ న్యూస్..భారీగా తగ్గనున్న పెట్రోల్,డీజీల్ ధరలు..

-

గత కొద్ది రోజులుగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. కొంతమంది పెట్రోలు ధరల కారణంగా వాహనాలను వాడటం లేదు..గత కొన్ని రోజులుగా వీటి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం గుడ్ న్యూస్ ను చెప్పనుంది.. త్వరలోనే వీటి ధరలను తగ్గించాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తుంది.. అంతర్జాతీయంగా పడిపోతున్న చమురు ధరలు.. మన దేశంలో ధర తగ్గుదలకు సూచికగా పేర్కొంటున్నారు.

ఇప్పటికే ఇంటర్నేషనల్‌ లెవల్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గినప్పటికీ.. మన దేశంలో మాత్రం పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులు మన దేశ వాహనదారులకు భారీ ఊరటనిస్తాయంటున్నారు. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలకు కళ్లెం వెయ్యాలని కేంద్రం కసరత్తులు చేస్తుంది.

పెట్రోల్, డీజీల్ ధరలు త్వరలో భారీగా తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ తగ్గింపు సుమారు 5 రూపాయల వరకు ఉండవచ్చు. ఈ నెల 8 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా ముడి చమురు ధరలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. కొద్ది కాలంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్ల దిగువకు పడిపోయింది. 2022 మార్చి నెల నుంచి ఇప్పటి వరకు సుమారు 27 శాతం మేర ముడి చమురు ధరలు పతనమయ్యాయి. దీంతో భారతీయ చమురు కంపెనీలు కూడా నష్టాల నుంచి చాలా వరకు బయటపడ్డాయి.

మరోవైపు రష్యా సైతం భారత్‌కు భారీ తగ్గుంపు ధరలో ముడి చమురును విక్రయిస్తోంది. దాదాపు 40 శాతం తగ్గింపుతో ముడి చమురును సరఫరా చేస్తోంది.ఇవన్నీ చూస్తూంటే ధరలు ఈరోజు నుంచే తగ్గినా ఆశ్చర్యం లేదు.ఏది ఏమైనా కూడా ఇది వాహనదారులకు బిగ్ న్యూస్ అనే చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Latest news