సినీ ఇండస్ట్రీలోకి ఉదయ్ కిరణ్ ఎలా అయితే అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే ఒక స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారో.. అంతే వేగంగా తన కెరీర్ని కూడా పతనం చేసుకున్నారు అని చెప్పవచ్చు. ఇక తాను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కెరియర్ ను నాశనం చేసుకొని చివరికి ఆత్మహత్యకు గురయ్యారు అనడంలో సందేహం లేదు. ఇక ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టమైన పని. కానీ తన నటనతో , తెలివితో అందరినీ మెప్పించి అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. కెరియర్ మొదలుపెట్టిన తొలినాలలోనే అన్ని సూపర్ హిట్ విజయాలను అందుకొని.. స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఇతడు స్టార్ డం చూసి దర్శక నిర్మాతల సైతం ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఉదయ్ కిరణ్ డేట్స్ కోసం అగ్ర దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు.ఇక ఇలాంటి సమయంలోనే సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు ఉదయ్ కిరణ్ . ఎందుకంటే వరుస సినిమాలకు కమిట్ అవ్వడం, అవి చివరికి ఫ్లాప్ అవడం, అవకాశాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇకపోతే ఉదయ్ కిరణ్ మరణం వెనుక అసలు విషయం ఏమిటి అనే విషయం ఎవరికీ తెలియకపోయినా.. ఎవరికి తోచిన విధంగా వారు చెబుతూనే వస్తున్నారు. ఇక ఈ క్రమంలోని ప్రముఖ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నటుడిగా , రాజకీయవేత్తగా చెరగని ముద్ర వేసుకున్న మురళీమోహన్ ఉదయ్ కిరణ్ గురించి పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాదు ఉదయ్ కిరణ్ ఒక జబ్బుతో బాధపడేవారు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు మురళీమోహన్.
ఉదయ్ కిరణ్ కు హైపర్ టెన్షన్ ఎక్కువ అని .. ఒక్కోసారి బిపి కూడా విపరీతంగా వస్తుందని, ఆ సమయంలో కంట్రోల్లో ఉండలేడు అని తెలిపారు మురళీమోహన్. ఇకపోతే మేము హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించగా డాక్టర్ ఇలా ఆవేశపడకూడదని.. చాలా ప్రశాంతంగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పారు అని తెలిపారు మురళీమోహన్. కానీ ఉదయ్ కిరణ్ ఏమాత్రం వినేవాడు కాదు ఎప్పటిలాగే హై బీపీతో బాధపడేవాడు.ఇక తర్వాత చిరంజీవి కూతురుతో నిశ్చితార్థం జరగడం, నిశ్చితార్థం క్యాన్సిల్ అవడం, వరుస సినిమాలు డిజాస్టర్ కావడం, ఒత్తిడి ఎక్కువై ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ మురళీ మోహన్ తెలిపారు.