ఐ బొమ్మ యూజర్లకి బిగ్ షాక్..!

-

ప్రస్తుత కాలంలో సినిమా థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా విరివిగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, Zee5 లాంటి నేషనల్ ఓటిటి ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉండగా ఇప్పుడు ఆహా వంటి తెలుగు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యాప్స్ లో వచ్చే కంటెంట్ ని ఐ బొమ్మ అనే ఒక వెబ్సైటు ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కొంతమంది వాస్తవానికి ఇది పైరసీ అయినా చాలా కాలం నుంచి తెలుగు ప్రేక్షకులందరూ ఈ వెబ్సైట్ ను విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు..

ఒకానొక సమయంలో ఈ వెబ్సైట్ను మూసివేస్తామని అన్నప్పుడు కూడా అవసరమైతే నెలకింత కడతాం సబ్స్క్రిప్షన్ లాంటి అవకాశాలు తీసుకురావాలని కూడా సోషల్ మీడియాలో యూసర్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే తర్వాత ఇబ్బందికరంగా ఉందని సైట్ మూసేస్తున్నామని ప్రకటించిన నిర్వాహకులు మళ్లీ మనసు మార్చుకొని నడుపుతామని తెలిపారు. ఇప్పుడు తాజాగా మరొకసారి నిర్వహకులు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వెబ్సైటు ఇండియాలో ఓపెన్ కావడం లేదు . సినీ ప్రేక్షకులను అలరించే ఐ బొమ్మ వెబ్సైట్ మళ్లీ ఆగిపోయింది. ప్రస్తుతం వెబ్సైట్ ఓపెన్ చేస్తే మన దేశంలో సేవలు నిలిచిపోయినట్లు ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది.

పలు కారణాలతో మూసివేస్తున్నట్లు గత ఏడాది ప్రకటించిన ఐ బొమ్మ.. ఆ వెంటనే కొద్దిరోజులకి తిరిగి మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఐ బొమ్మ వెబ్సైట్లో ఇలాంటి వీడియోస్ చూడడం నేరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఎంతో కష్టపడి కంటెంట్ కొనుగోలు చేసి ప్రేక్షకులకు ధర ఫిక్స్ చేసి వారి ముందుకు తీసుకొస్తున్నాయి. కానీ ఇలా పైరసీ చేయడం వల్ల వాటికి నష్టం చేకూరుతుందని అంటున్నారు. అందుకే ప్రస్తుతం ఐ బొమ్మ బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి త్వరలో ఓపెన్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news