నేడు సిరిసిల్లాకు కేటీఆర్… బలగం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు హాజరు

-

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బలగం గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ గారు హాజరు కానున్నారు. రాజన్నసిరిసిల్లజిల్లా నుండి వస్తున్న తొలి పెద్ద సినిమా బలగం. 1997 లో సిరిసిల్ల మార్కెట్ లో కూరగాయలు అమ్మిన వేణు వెల్దండి Comedian Venu Tillu…. తెలుగు పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’తో కమెడియన్‌ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

అలా జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కమెడియన్ ‘వేణు’. జబర్దస్త్‌లో తన కామెడీతో అందర్నీ ఆకట్టుకున్న వేణు.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగా మారబోతున్నాడు. వేణు స్వస్థలం సిరిసిల్ల. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాజన్నసిరిసిల్లజిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామంలో జరిగింది. బలగం సినిమాలో దాదాపు 200 మంది గ్రామస్థులు కనిపిస్తారు. అలాగే, బలగం సినిమా లో ఆర్టిఫిషియల్ తెలంగాణ యాస కాకుండా నాచ్యురల్ తెలంగాణ యాస చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news