కడపలో జగన్‌కు భారీ షాక్..టీడీపీలోకి డీఎల్.!

-

వైసీపీ కంచుకోట, జగన్ సొంత జిల్లా కడపలో భారీ షాక్ తగిలేలా ఉంది. ఎన్నో ఏళ్లుగా కడపలో రాజకీయం చేస్తున్న సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. ఈ మేరకు ఆయన ఓపెన్ గానే చంద్రబాబు తప్ప మరొకరు రాష్ట్రాన్ని కాపాడలేరు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. జగన్ అధికారంలోకి రాగానే అవినీతితో పాలన మొదలుపెట్టారని, ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే అని, ఏపీని చంద్రబాబు తప్ప మరొకరు కాపాడలేరని, పవన్ నిజాయితీని ప్రశించలేమని, వచ్చే ఎన్నికల్లో బాబు-పవన్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, కానీ వైసీపీలో  ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి మైదుకూరులో పోటీ చేస్తానని అన్నారు. జనవరి 3 నుంచి వివేకా హత్య కేసు మలుపులు తిరుగుతుందని చెప్పి డీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే 1978 నుంచి డీఎల్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1978లో మైదుకూరు నుంచి ఇండిపెండెంట్ గా గెలిచారు. 1983, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు.

కానీ గత ఎన్నికల ముందు టీడీపీలో చేరాలని చూశారు..కానీ చంద్రబాబు సీటు ఫిక్స్ చేయలేదు. దీంతో డీఎల్ వైసీపీలో చేరి..మైదుకూరులో వైసీపీ గెలుపు కోసం పనిచేశారు. మైదుకూరులో వైసీపీ గెలిచింది. అలాగే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత డీఎల్‌ని వైసీపీ పట్టించుకోలేదు. అలాగే మధ్య మధ్యలో డీఎల్..జగన్ పాలన పై విమర్శలు చేశారు.  తాజాగా మరీ ఎక్కువగా జగన్ పై విరుచుకుపడ్డారు.

అలాగే బాబుని పొగడటం బట్టి చూస్తే ఆయన టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ మైదుకూరు సీటులో టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఆయన్ని కాదని డీఎల్‌కు సీటు ఇస్తారనేది డౌటే. అయితే మైదుకూరులో డీఎల్‌కు పట్టుంది. డీఎల్ గాని టీడీపీలోకి వెళితే..అక్కడ వైసీపీకి నష్టమే. మరి డీఎల్ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news