రజనీ కాంత్ మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు. తనకి ఎవరైనా సినిమా నచ్చితే వెంటనే కాల్ చేసి వారికి అభినందనలు తెలుపుతారు. అలాగే వారికి టైమ్ ఉంటే ఇంటికి పిలచి మరీ భోజనం పెట్టి, సన్మానించి మరీ పంపుతారు. వారు ఎంత చిన్న వారు అయినా కూడా ఆయన ఇలాగే చేస్తారు. అలాగే తాను కూడా ఎటువంటి హడావుడి లేకుండా, స్టార్ అనే ఇగో లేకుండా సాదారణ మనిషి లా ఉంటారు.
గతంలో కాంతారా వంటి సూపర్ హిట్ కొట్టిన రిశిబ్ శెట్టి ని కూడా ఇంటికి పిలిచి సన్మానించారు. అలాగే అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఆ సినిమా ఎలా తీసారో ఆసక్తిగా అడిగి మరీ తెలుసుకున్నారు. ఇక రీసెంట్ గా తమిళం లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న లవ్ టుడే ను తెలుగు లో దిల్ రాజు డబ్ చేసి విడుదల చేసిన విషయం తెల్సిందే. తెలుగు లో కూడా లవ్ టుడే బాగానే వసూళ్ళు రాబట్టింది.
తాజాగా ఆ సినిమా డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ కు రజినీకాంత్ నుండి పిలచి సన్మానించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .మంచి కథను రెడీ చేస్తే రజినీకాంత్ డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. లైకా ప్రొడక్షన్స్ వారు వీరిద్దరి కాంబోలో సినిమా ను నిర్మించేందుకు సిద్ధం అయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే ప్రదీప్ రంగనాథన్ రెండో సినిమాకే చాలా సాధించి నట్టు లెక్. రజినీకాంత్ తో సినిమా హిట్ అయితే పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోతాడు.