ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఐపీఎస్‌ పదవికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాలంటరీ రిటైర్మెంట్‌ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

ఈ సంచలన నిర్ణయంపై ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కూడా స్పందించారు. తన పదవి విరమణకు స్వచ్ఛందంగానే దరఖాస్తు చేసుకున్నానని స్పష్టం చేశారు. ఐపీఎస్‌ గా రెండున్నర దశాబ్దాలుగా సర్వీసు అందించానని పేర్కొన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. నా మనసుకు ఇష్టమైన పనులు నా కిష్టమైన రీతిలో చేయబోతున్నానని పేర్కొన్నారు. పదవి విరమణ ఫూలే, అంబేద్కర్‌ మార్గంలో నడుస్తానని ప్రకటించారు ప్రవీణ్‌ కుమార్‌. పేద ప్రజలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.  తన రాజీనామా పై ఎలాంటి ఒత్తిళ్లు గానీ, ఇతర కారణాలు గానీ లేవని పేర్కొన్నారు. కాగా… ప్రస్తుతం ప్రవీణ్‌ కుమార్‌… తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులు విద్యాలయాల సంస్థ సెక్రటరీగా ఉన్న సంగతి తెలిసిందే.