బిగ్ బాస్ లో బిగ్ షాక్.. హౌస్ వీడనున్న స్టార్ యాంకర్?

తెలుగు టెలివిజన్ షోలో అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న బిగ్ బాస్ షో, చివరి దశకి వచ్చేసింది. హౌస్ లో ఎనిమిది మందే ఉన్నారు. ఆ ఎనిమిది మందిలో నుండి ఒక కంటెస్టెంట్ హౌస్ వీడనున్నారు. నామినేషన్లలో ఉన్న ఆరుగురిలో మోనాల్, ఆరియానా, హారిక డేంజర్ జోన్లో ఉన్నట్టు వినబడింది. తాజా సమాచారం ప్రకారం ఈ ముగ్గురూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారట. ఎవ్వరూ ఊహించని విధంగా స్టార్ యాంకర్ లాస్య హౌస్ నుండి బయటకు వెళ్ళనుందని అంటున్నారు.

ఈ వారం మొత్తం లాస్యకి తక్కువ ఓట్లు వచ్చాయట. ఫ్యామిలీ రీ యూనియన్ ఎపిసోడ్ మినహాయిస్తే మిగతా రోజుల్లో లాస్య పెద్దగా కనిపించింది లేదు. ఫ్యామిలీ రీ యూనియన్ ఎపిసోడ్ కి ఓట్లు బాగానే వచ్చినప్పటికీ, అంతకుముందు తక్కువ ఓట్లు పోలవడంతో మిగతా వారిని వెనక్కి నెట్టి ఎలిమినేషన్లోకి వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. హారిక, మోనాల్ లేదా ఆరియానా.. ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్న వారికి లాస్య ఎలిమినేట్ అయితే పెద్ద షాకే. మరేం జరుగుతుందో చూడాలి.