100 రోజులుగా.. అక్క‌డ ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదు..!

-

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. అయితే న్యూజిలాండ్‌లో మాత్రం క‌రోనా పూర్తిగా కంట్రోల్‌లో ఉంది. అక్క‌డ గ‌త 100 రోజులుగా ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదు. ఈ వివ‌రాల‌ను అక్క‌డి వైద్య అధికారులు ఆదివారం తెలిపారు. అయితే ఇటీవ‌ల విదేశాల నుంచి వ‌చ్చిన 23 మందికి క‌రోనా ఉన్న‌ట్లు గుర్తించారు. అందువ‌ల్ల వారే ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్నారు. కానీ ఆ దేశంలో మాత్రం గ‌త 100 రోజులుగా ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదు.

no corona cases reported in newzealand in last 100 days

100 రోజుల పాటు ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాకుండా చూసుకోవ‌డం గొప్ప విష‌య‌మ‌ని అక్క‌డి హెల్త్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని, క‌నుక అలా జ‌ర‌గ‌కుండా తాము క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని.. అందుక‌నే క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం లేద‌ని తెలిపారు.

కాగా న్యూజిలాండ్ జ‌నాభా మొత్తం క‌లిపి 50 ల‌క్ష‌లు. మార్చి 19 నుంచే ఆ దేశం విదేశాల నుంచి వ‌చ్చేవారికి గేట్ల‌ను మూసేసింది. అలాగే అక్క‌డ క‌రోనాను విజ‌య‌వంతంగా నిరోధించారు. ఈ విష‌య‌మై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా న్యూజిలాండ్‌ను ప్ర‌శంసించింది. అంద‌రూ ఆ దేశ మోడ‌ల్‌ను ఆద‌ర్శంగా తీసుకుని కరోనా క‌ట్ట‌డికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చింది. ఫిబ్ర‌వ‌రిలో న్యూజిలాండ్‌లో 1219 క‌రోనా కేసులు ఉండేవి. కానీ ఆ దేశం క‌రోనాను విజ‌య‌వంతంగా అదుపు చేసింది. అక్క‌డ మాస్కుల‌ను ధ‌రించ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేశారు. అలాగే భౌతిక దూరం నిబంధ‌న‌ను క‌చ్చితంగా పాటించారు. విదేశాల నుంచి వ‌చ్చే వారిని 14 రోజుల పాటు క‌చ్చితంగా క్వారంటైన్ చేశారు. అందువ‌ల్లే అక్క‌డ కరోనా ప్ర‌భావం పూర్తిగా త‌గ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news