ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్ని విధాలుగా బలపడాలి అని చూసినా సరే ఆ పార్టీకి మాత్రం అనుకూల పరిస్థితులు ఏ విధంగా కూడా కనపడటం లేదు అనే చెప్పాలి. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక పక్క బలపడటానికి ప్రయత్నాలు చేస్తున్నా సరే నమ్మకంగా ఉండే నేతలు ఒక్కొక్కరు ఇప్పుడు చంద్రబాబుకి గుడ్ బై చెప్తున్నారు.
ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్దాలి గిరి వల్లభనేని వంశీ మోహన్ అలాగే కరణం బలరాం చంద్రబాబుకి దూరం జరిగి జగన్ కి దగ్గరయ్యారు. ఇప్పుడు మరో నేత పార్టీ వీడటానికి సిద్దమయ్యారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహిత నేతగా పేరున్న సిద్దా రాఘరవరావు పార్టీ మారాలి అని నిర్ణయం తీసుకున్నారు. రేపు కొడుకుతో కలిసి ఆయన తాడేపల్లిలో జగన్ సమక్షంలో పార్టీ మారతారు.
పార్టీలోనే కాదు జిల్లాలో కూడా ఆయనకు మంచి వర్గం ఉంది. దాదాపు ఆరు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఆయన ఒంగోలు పార్లమెంట్ కి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయన పార్టీ మారడంతో ఆయన వర్గం కూడా పార్టీ మారే సూచనలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆయనకు ఒంగోలు పార్లమెంట్ లోనే కాదు, నెల్లూరు జిల్లాలో కూడా మంచి పట్టు౦ది.