మన దేశంలో క్రికెట్ మ్యాచుల కోసం జనాలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు అనేది అందరికి తెలిసిందే. ఒక్క మ్యాచ్ కూడా ఇప్పుడు జరిగే అవకాశాలు కనపడటం లేదు. దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు మ్యాచ్ లను నిర్వహించే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇక కీలకమైన ఐపిఎల్ నిర్వహణ విషయంలో ఇప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి.
ఐపిఎల్ ని నిర్వహించే అవకాశం లేదని చాలా వరకు అభిప్రాయాలు వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఐపిఎల్ నిర్వహణతో పాటుగా కీలక నిర్ణయం ఒకటి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ముంబైలో, పూణేలో, హైదరాబాద్ లో, కటక్ లో ఐపిఎల్ మ్యాచులను నిర్వహించే ఆలోచనలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఉంది అని సమాచారం. ఆగస్ట్ నాటికి కరోనా ప్రభావం తీవ్రంగా ఉండదు అని భావిస్తున్నారు.
రాబోయే రెండు వారాల్లో కేసులు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దీనిపై నమ్మకంగానే ఉంది. రెండు వారాల తర్వాత విదేశాల నుంచి వచ్చే ఆటగాళ్ళు అందరిని కూడా తీసుకొచ్చి వారిని క్వారంటైన్ చేసే ఆలోచనలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఉంది అని సమాచారం. త్వరలోనే ఆయా దేశాల క్రికెట్ కంట్రోల్ బోర్డ్ లకు దీనికి సంబంధించి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని తెలుస్తుంది. త్వరలో షెడ్యుల్ వచ్చే అవకాశం ఉంది.