హుజూరాబాద్‌లో ఈటలకు భారీ షాక్

కరీంనగర్: బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు భారీ షాక్ తగిలింది. ఇల్లందకుంట మండలం ఎంపీపీ పావని, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, ముగ్గురు సర్పంచ్‌లు టీఆర్ఎస్‌లో చేరారు. ఇల్లందకుంట టీఆర్ఎస్ మండల ఇంచార్జ్, ఎమ్మెల్యే రవి శంకర్ ఆధ్వర్యంలో వీరంతా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

కాగా ఇల్లందకుంటలో ఈటల పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయనకు అనుచరులు షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్‌లో ఈటలకు పరాభవం జరిగిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం ఈటల వెంటే ఉన్నారు. ఇల్లందకుంట మండలం ఎంపీపీ పావని, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, ముగ్గురు సర్పంచ్‌లు కూడా ఈటల వెంటే నడిచారు. కానీ ఇప్పుడు వీరు బీజేపీనీ వీడి కారెక్కారు. త్వరలో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో వీరంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీకి భారీ షాక్ తగిలినట్లైంది.