ఎమ్మెల్యే రోజాకు షాకిచ్చిన జగన్‌ !

నగరి ఎమ్మెల్యే రోజా కు వైసీపీ పార్టీలో ఫైర్‌ బ్రాండ్‌ గా పేరుంది. ప్రతి పక్షాలకు కౌంటర్లకు… రివర్స్‌ కౌంటర్లు చేస్తూ… ఎమ్మెల్యే రోజా తన దైన స్టైల్‌ లో పార్టీలో ముందుకు సాగుతోంది. అయితే.. తాజాగా ఎమ్మెల్యే రోజాకు ఏపీ సీఎం జగన్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు.

పార్టీ కోసం పదేళ్ల కాలంగా పని చేసే వారికి ప్రాధానత్య ఇచ్చేందుకు.. ఎమ్మెల్యే లకు జోడు పదవులు ఉండకూడదని.. సీఎం జగన్‌ కొత్త పాలసీని తీసుకువచ్చారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే రోజా తో పాటు మాల్లాది విష్ణు, జక్కంపూడి రాజా పదవులను కోల్పోయారు.

అయితే.. రోజా సైతం వైసీపీ పార్టీ ఏర్పాటు సమయం నుంచి ఆయనకు మద్దుతుగా ఉన్నప్పటికీ.. ఆమెకు ఉన్న నామినేటెడ్‌ పదవి నుంచి తొలగించారు. ఆమె నామినేటెడ్‌ పదవి తొలిగించి… మెట్టు గోవర్ధన్‌ రెడ్డికి కేటాయించారు సీఎం జగన్‌. అయితే… దీనిపై ఎమ్మెల్యే రోజా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.