“నయీం డైరీస్” షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు..సినిమా ఆపేయాలంటూ ఆదేశాలు !

“నయీం డైరీస్” సినిమా బృందానికి దిమ్మతిరిగే షాకిచ్చింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. నయీం డైరీస్ చిత్రం లో అభ్యంతరకర దృశ్యాలు తొలగించాలని తాజాగా తెలంగాణ హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమ కారురాలు బెల్లి లలిత కుటుంబ సభ్యుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న హై కోర్టు న్యాయమూర్తి.. అభ్యంతరకర దృశ్యాలు తొలగించే వరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశించారు.

అయితే అభ్యంతరకర దృశ్యాలు తొలగించేందుకు రెండు రోజుల సమయం కోరారు “నయీం డైరీస్” సినిమా డైరెక్టర్ తరపు న్యాయవాది. సాధ్యమైనంత తొందరగా నయీం డైరీస్ చిత్రం లో అభ్యంతరకర దృశ్యాలు తొలగించాలని పేర్కొంది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. తదుపరి విచారణ బుదవారంకు వాయిదా వేసింది తెలంగాణ హై కోర్టు.

కాగా నయీమ్ డైరీస్ సినిమా గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన రోజు.. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్లో ఈ సినిమాను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఈ కేసు పై కేసు వేశారు తెలంగాణవాదులు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ హైకోర్టు సినిమాను ఆపేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.