‘పుష్ప’ కు బిగ్ షాక్.. విడుదల వాయిదా ?

‘పుష్ప’ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. పుష్ప హిందీ వెర్షన్‌ కు సెన్సార్ నిరాకరించింది. దీంతో ‘పుష్ప’సినిమాకు సెన్సార్ కష్టాలు మొదలఅయ్యాయి. ఊహకు మించి ‘పుష్ప’ కు క్రేజ్ వచ్చిన నేపథ్యంలో సెన్సార్ సమస్యలు తలెత్తడం ఫాన్స్, నిర్మాతలతో పాటు అందరిని షాక్ కు గురి చేస్తోంది. ఐదు భాషల్లో ఒకే సారి డిసెంబర్ 17న విడుదల కానుంది పుష్ప సినిమా.

సెన్సార్ కోసం రాత్రింబవళ్ళు పని చేస్తుంది టెక్నికల్ టీమ్. ‘రా’ మెటీరియల్ తోనే తెలుగు సెన్సార్ పూర్తి చేశారు. కన్నడ వెర్షన్ సెన్సార్ కూడా రా మెటీరియల్ తోనే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే హిందీ వెర్షన్ కు సభ్యుల సెన్సార్ నిరాకరించింది. పూర్తి స్థాయి ప్రింట్ తోనే సెన్సార్ చేస్తామని స్పష్టం చేసింది సెన్సార్ బోర్డు. దీంతో ‘పుష్ప’ కు బిగ్ షాక్ తగిలింది. మరి దీనిపి నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.