టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహార్ భార్య జయా భరద్వాజ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది. తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు సదరు దుండగులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు. ఈ విషయమై దీపక్ తండ్రి ఆగ్రా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
విషయంలోకి వెళితే, రిక్ స్పోర్ట్స్ ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేష్ పరేక్ జయ భరద్వాజ్ దగ్గర రూ. 10 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యాపారం కోసం అని చెప్పడంతో 2022 అక్టోబర్ 7న ఆన్లైన్ లో రూ. 10 లక్షలు పంపించారు. కానీ ఆ డబ్బును వారు దుర్వినియోగం చేసినట్టు తెలుసుకున్న జయ భరద్వాజ్ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగారు. అయితే తండ్రి, కొడుకులు డబ్బు తిరిగి ఇవ్వడమే కాకుండా ఫోన్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో దుర్భాషలాడారని, చంపేస్తామంటూ బెదిరించారని దీపక్ చాహార్ తండ్రి పేర్కొన్నారు.అయితే ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.