బద్వేలు పోరులో అదిరిపోయే ట్విస్ట్…రెండుగా చీలిన టీడీపీ…

-

బద్వేలు ఉపఎన్నిక పోరుపై మొదట నుంచి ఎవరు పెద్దగా ఆసక్తిగా లేరు. ఎందుకంటే అక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ చేయడం లేదు…అలాగే జనసేన సైతం పోటీ నుంచి తప్పుకుంది. వైసీపీకి ఏకగ్రీవం అవుతుందనే ఉద్దేశంలో టీడీపీ-జనసేనలు పోటీ నుంచి తప్పుకున్నాయి. కానీ కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పోటీకి దిగాయి. దీంతో పోటీ అనివార్యమైంది. పోటీ ఉన్నా సరే గెలుపు వైసీపీదే అని క్లియర్ గా అర్ధమైపోతుంది.

badvelఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌లకు అంతా సత్తా లేదనే సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు పార్టీలు నోటాతో పోటీ పడతాయని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ పోటీలోకి వచ్చింది. ఎప్పుడైతే అమిత్ షా, చంద్రబాబుకు ఫోన్ చేశారో…అప్పటినుంచి పరిస్తితి మారిపోయింది. బహిరంగంగా చెప్పకపోయిన బద్వేలులో టీడీపీ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తుంది. ఆ విషయం ఇప్పుడు పోలింగ్ రోజు బయటపడింది. చాలా పోలింగ్ కేంద్రాల్లో బీజేపీకి ఏజెంట్లు లేక టీడీపీ నాయకులని ఏజెంట్లుగా కూర్చోపెట్టారు.

బద్వేలులో చాలాచోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు మారారు… బీజేపీకి దగ్గరవడానికి బద్వేల్‌ ఎన్నికలను టీడీపీ వాడుకుంటోందని తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీలో మరో వర్గం వైసీపీకి మద్ధతు ఇస్తుంది. అంటే టీడీపీలో ఊహించని విధంగా చీలిక వచ్చేసింది…ఒక వర్గం బీజేపీ వైపుకు వెళితే…మరో వర్గం అంటే టీడీపీలో ఉన్న దళిత నేతలు వైసీపీ వైపుకు వచ్చారు. వారు పూర్తిగా వైసీపీకి మద్ధతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా పోటీలో లేకపోయినా సరే బద్వేలు ఉపఎన్నికలో టీడీపీ కీలకంగా మారిపోయింది. మరి టీడీపీ…బీజేపీకి మద్ధతు ఇవ్వడం వల్ల ఓట్లు ఏమన్నా కాస్త ఎక్కువ పడతాయి గానీ, వైసీపీ గెలుపుని మాత్రం అడ్డుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. కాకపోతే బీజేపీకి దగ్గరవ్వడానికి చంద్రబాబు ఈ రకంగా బద్వేలు ఉపఎన్నికని వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news