చందానగర్ ప్రేమ జంట కేసులో బిగ్ ట్విస్ట్ !

చందానగర్‌ లాడ్జిలో తాజాగా ఓ యువతిని మర్డర్‌ చేసి… ఓ యువకుడు పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో యువతి కుటుంబ సభ్యులు సంచలన విషయాలు చెప్పారు. కోటిరెడ్డి తో నాగచైతన్యను ఇచ్చి పెళ్లి చేయడానికి తాము ఒప్పుకున్నామని…. కోటిరెడ్డి తో ప్రేమ విషయం చెప్పింది, ముందుగా భయపడ్డాం కాని ఆ తరువాత ఒప్పుకున్నామని తెలిపారు నాగచైతన్య కుటుంబసభ్యులు.

హైదరాబాదులోని ఆర్ఎస్ఎస్ లో ఇద్దరికీ పెళ్లి చేస్తామని చెప్పామని.. .కానీ ఇక్కడ నాగచైతన్యని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందోనని కోటిరెడ్డి అడ్డు తొలిగించుకోవాలనుకున్నాడని ఆరోపించారు.
నాగచైతన్యని అంతమొందించాలనే నల్లగండ్లలోని లాడ్జికీ తీసుకెళ్ళాడని… 23వ తేదీన తీసుకెళ్లి ఆమెను హత్య చేసి పారిపోయాడని తెలిపారు. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని నమ్మించి ఆమె గొంతుకోశాడని… ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత లాడ్జి నుండి పారిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒంగోలులో ఉన్నాడని… బ్లేడ్ తో కోసుకొని డ్రామా చేసి ఆడ్మీట్ అయ్యాడని ఫైర్ అయ్యారు. కోటిరెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.