మాటలతో మాయ చేయడంలో కేసీఆర్‌ని మించిన నాయకుడు లేరనే చెప్పాలి. సినిమాల్లో డైరక్టర్ తివిక్రమ్‌ని మాటల మాంత్రికుడు అని అందరూ అంటారు….కానీ రాజకీయాల్లో మాటల మాంత్రికుడు కేసీఆరే అందులో డౌట్ లేదనే చెప్పొచ్చు. ఇక మాటలతో కేసీఆర్ ఎలాంటి మాయలు చేస్తారో….తన వ్యూహాలతో ప్రత్యర్ధులని ఎలా చిత్తు చేస్తారో అందరికీ బాగా తెలుసు. తన మాటల గారడీ ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు పెద్దగా అర్ధం కాలేదనే చెప్పాలి…కానీ ఇప్పుడుప్పుడే బాగా అర్ధమవుతుందని చెప్పాలి. అసలు దళితుడుని సీఎం చేస్తానన్నప్పుడే ప్రజలు అర్ధం చేసుకుని ఉండాల్సింది…కానీ కేసీఆర్ అర్ధం కావడానికి ఏడేళ్లు సమయం పట్టింది.
అయితే జనాలకు తన గురించి అర్ధమైతే కేసీఆర్ ఎందుకు ఊరుకుంటారు…వెంటనే తన మాటలతో మళ్ళీ గారడీ చేసేస్తారు. తాజాగా టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో అదే చేశారు. అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక కేసీఆర్ మాట్లాడుతూ…తన పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతటి సుఖసంతోషాలతో ఉన్నారో…నిరుద్యోగులు, రైతులు, ఉద్యమ కారులు, వారి కుటుంబాలు, మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పారు. అలాగే తన ప్రభుత్వ పథకాల వల్ల ఎలాంటి లబ్ది పొందుతున్నారో చెప్పారు. దేశంలోనే ఇంత బాగా ఏ రాష్ట్రంలో కూడా పథకాలు అమలు కావడం లేదని, అందుకే తెలంగాణకు బోర్డర్‌లో ఉన్న ఇతర రాష్ట్ర ప్రజలు తెలంగాణకు వచ్చేస్తామని లేదంటే తమ ప్రాంతాలని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఐదు నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని, కర్ణాటకలోని రాయచూర్ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలో కలపమని డిమాండ్ చేస్తున్నారని, అసలు ఏపీ వాళ్ళు అయితే ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని కేసీఆర్ సెలవిచ్చారు. ఏపీలోనూ టీఆర్ఎస్ పెడితే తాము గెలిపించుకుంటామని వారు అంటున్నారని అన్నారు. అంటే తన పాలన చూసి ఇతర రాష్ట్ర ప్రజలు ఎంత క్రేజ్‌తో ఉన్నారో అని కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇతర రాష్ట్రాల ప్రజలే కేసీఆర్‌ని కోరుకుంటున్నారని కాబట్టి తెలంగాణ ప్రజలు…కేసీఆర్ లాంటి సీఎంని వదులుకోకూడదని అనుకోవాలని కేసీఆర్ వేసిన ఎత్తుగడ అని క్లియర్‌గా అర్ధమైపోతుంది. కాబట్టి కేసీఆర్ పాత ప్లాన్స్ ఇప్పుడు వేస్తే వర్కౌట్ కావనే చెప్పాలి.