Bangarraju : అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్‌ న్యూస్‌ “బంగార్రాజు” బిగ్‌ అప్డేట్‌

-

అక్కినేని నాగార్జున హీరో గా చేసిన.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఏ రేంజ్‌ లో హిట్‌ అయిందో తెలిసిందే. అయితే.. ప్రస్తుతం అక్కినేని నాగార్జున.. బంగార్రాజు సినిమా చేస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్‌ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు. ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. నవంబర్‌ 23 వ తేదీన అక్కినేని నాగ చైతన్య బర్త్‌ డే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. నవంబర్‌ 22 వ తేదీన సాయంత్రం 5.22 గంటలకు బంగార్రాజు ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేస్తునట్లు ప్రకటించింది చిత్ర బృందం. అంతేకాదు… నాగచైతన్య పుట్టిన రోజున అంటే నవంబర్‌ 23 న ఉదయం 10.23 గంటలకు ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news