సాహసక్రీడలు ఇష్టపడే వాళ్ళు.. చలికాలంలో ఇక్కడకి వెళ్లాల్సిందే.!

-

చలి కాలంలో చాలా మంది ఏదైనా కొత్త ప్రదేశాన్ని చూడాలని అనుకుంటూ ఉంటారు. పైగా చల్లటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. చలి కాలంలో మీరు కూడా ఏదైనా ట్రిప్ వేయాలి అని అనుకుంటున్నారా అయితే కచ్చితంగా ఇక్కడికి వెళ్లాల్సిందే. చలికాలంలో ఉత్తరాఖండ్ ని చూసేందుకు చాలా మంది వెళుతూ ఉంటారు. సాహస క్రీడలకు ఇది ఒక మంచి గమ్యస్థానం అని చెప్పొచ్చు.

చలి కాలంలో మంచు కొండల్లో సహస క్రీడల్ని ఆస్వాదించే వాళ్లు కచ్చితంగా ఉత్తరాఖండ్ వెళ్లాల్సిందే. శీతాకాలంలో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది పర్యటకులు యాత్రికులు సాహస ప్రియులను ఈ ప్రదేశం అంతా కూడా ఎంతో గానో ఆకర్షిస్తుంది. హిమాలయ అందాలని కూడా మీరు చూసేయొచ్చు. అలానే ఇక్కడ సంప్రదాయాలతో పాటు స్థానిక వంటకాలను కూడా మీరు చూడొచ్చు. మరి ఇక హిమాచల్ లో ఉంటే అడ్వెంచర్ యాక్టివిటీస్ గురించి చూద్దాం.

పారాగ్లైడింగ్:

అందమైన పర్వతాలు, లోయలను చూడటం ఎంతో బాగుంటుంది. ఇక్కడ మీరు పారాగ్లైడింగ్ ని ఎంజాయ్ చేసేయచ్చు.

ట్రెక్కింగ్, క్యాంపింగ్:

ఇక్కడ పర్యాటకులు ట్రెక్కింగ్ కి వెళ్ళచ్చు. శీతాకాలంలో చక్కగా ఇక్కడ ఎంజాయ్ చెయ్యచ్చు. అలానే ఇక్కడ క్యాంపింగ్‌లో చలి మంటలు కాచుకుని చక్కగా టైం స్పెండ్ చేసేయచ్చు.

రాఫ్టింగ్:

ఇక్కడ రాఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది. శీతాకాలంలో చక్కగా ఇక్కడ రాఫ్టింగ్ కూడా చేసేయచ్చు. ఇలా శీతాకాలంలో చాలా మంది పర్యటకులు యాత్రికులు సాహస ప్రియులు ఎంజాయ్ చేసేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news