బిగ్‌బాస్ సీజన్ 4 మొత్తానికి సగం అంకం పూర్తయింది. ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియతో హీటెక్కిన హౌస్‌ని నాగార్జున చల్లబర్చే ప్రయత్నం చేశారు. మెహబూబ్, అమ్మరాజశేఖర్ ఇద్దరూ ఎలిమినేషన్ రౌండ్‌లోకి వచ్చారు. ఈ ఇద్దరిలో హౌస్ మేట్స్ అమ్మని ఎలిమినేట్ చేయడం, మోహబూబ్‌ని సేవ్ చేయడంతో అమ్మ హౌస్ నుంచి బయటికి రావడం ఇక ఖాయం అయిపోయింది. దీంతో ఒక్కసారిగా హౌస్ హీటెక్కింది. చివరికి వరకు ఎలిమినేషన్ ని ఉత్కంఠగా సాగించిన నాగ్ అమ్మ హౌస్‌లోకి వెళ్లి బ్రీఫ్ కేసు సర్దుకునే సరికి ఈ వారం ఎలిమినేషన్ లేదని నువ్వు సేప్ అవ్వడమే కాకుండా డైరెక్ట్‌గా కెప్టెన్ గా పోటీకి నామినేట్ య్యావని చెప్పడంతో ఇంటి సభ్యుఏలంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
నేడు సోమవారం కావడంతో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అంతకు ముందు కెప్టెన్ అరియానాకు, సోహైల్‌కు మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. నిద్రపోయాడని నాలుగు బకెట్ల వాటర్ పోసుకోవాలని పనిష్మెంట్ ని అరియానా సూచించడంతో హౌస్‌లో అసలు రచ్చ మొదలైంది. ఆ వెంటనే నామినేషన్ ప్రక్రియని బిగ్‌బాస్ ప్రకటించాడు. నామినేట్ చేసే వ్యక్తుల తలపై ఎగ్ కొట్టి కారణం చెప్పాలని అలా ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పడంతో ముందు అరియానా నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. అరియానా సోహైల్‌ని, హారికని నామినేట్ చేసింది. ఆ తరువాత అవినాష్ వెళ్లి అభిజిత్‌ని, హారికని నామినేట్ చేశాడు.
ఆ తరువాత సోహైల్ అభిజిత్‌ని , మోనాల్‌ని నామినేట్ చేయగా అభిజిత్‌కి అవినాష్ ని నామినేట్ చేసిరీజన్ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. నేను కామెడీ చేయడానికి రాలేదని, అలా కామెడీ తనపై చేస్తే అంగీకరించనని అవినాష్‌ని అభిజిత్ నామినేట్ చేశాడు. ఆ తరువాత అమ్మ రాజశేఖర్ ని అభిజిత్ నామినేట్ చేయడంతో వీరిద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. తనని కావాలనే టార్గెట్ చేస్తూ ఇంటి నుంచి బయటికి పంపించాలని చూస్తున్నారని అమ్మ రాజశేఖర్ అసహనాన్ని ప్రదర్శించడం మరింత రచ్చకు కారణంగా మారబోతోంది. మంగళవారం ఎపిసోడ్ హౌస్‌ని మరింత హీటెక్కించే విధంగానే కనిపిస్తోంది. షాకింగ్ విషయం ఏంటంటే లవ్ బర్డ్స్‌లా వుండే మోనాల్‌ని అఖిల్ నామినేట్ చేయడం ఇంటి సభ్యుల్ని విస్మయానికి గురిచేసింది. నామినేషన్ మంగళవారం మరింత రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది.
Asalaina aata modalu…Nomination process started #BiggBossTelugu4 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/pfJSHH782w
— starmaa (@StarMaa) November 2, 2020