Bigboss6: రన్నర్ గా శ్రీహన్ గెలిచింది ఎంతంటే..?

-

బుల్లితెరపై ప్రేక్షకుల ఆదరణ అందుకొని నెంబర్ వన్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే పలు సీజన్లను విజయవంతంగా ముగించింది. ఇకపోతే ఇప్పుడు ఆరవ సీజన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇందులో ఆరంభం నుంచి చక్కని ఆట తీరుతో ఆకట్టుకున్న శ్రీహన్ సూట్ కేస్ తీసుకొని రన్నర్ తో సరిపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు బిగ్ బాస్ షో ద్వారా సంపాదించింది ఎంత? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో మాదిరిగానే బిగ్ బాస్ ఆరవ సీజన్ కి సంబంధించిన ఫినాలే ఎపిసోడ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. ముందుగా రోహిత్ ఎలిమినేట్ అయ్యి ఐదో స్థానంతో ప్రయాణాన్ని ముగించాడు. నాలుగవ స్థానం ఆదిరెడ్డి, మూడవ స్థానంలో కీర్తి మిగిలారు. దీంతో రేవంత్, శ్రీహాన్ టాప్ 2గా నిలిచారు. వీళ్ళలో విజేతను నిర్ణయించే ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. రేవంత్, శ్రీహాన్లకు హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి గోల్డెన్ సూట్ కేస్ తో వెళ్లి ఆఫర్ ఇచ్చాడు. ముందుగా రూ.20 లక్షలు ఇస్తానన్న ఆయన ఎన్నో బేరాలు ఆడిన తర్వాత దానిని రూ.40 లక్షల చేశాడు ఆ అమౌంట్ కి టెంప్ట్ అయిన శ్రీహన్ ఓకే చెప్పేసాడు.

ఇక శ్రీహాంత్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే శ్రీహాన్ కు షో నిర్వహకులు వారానికి 50వేల రూపాయల చొప్పున రెమ్యుననరేషన్ ఇచ్చారు. అంటే 15 వారాలకు గాను రూ.7.5 లక్షల రెమ్యునరేషన్ లభించింది. మరొకవైపు రూ.40 లక్షల ప్రైజ్ మనీకి ఒకే చెప్పి రన్నర్ తో సరిపెట్టుకున్న ఈయన లెన్స్ కార్ట్ కాంటెస్ట్లో రూ.5 లక్షలు గెలిచాడు. ఇలా మొత్తం రూ.45 లక్షలు సంపాదించాడు. ఇక రెమ్యునరేషన్ మొత్తం అంతా కలిపి రూ.52.50 లక్షలు ఈయన సొంతం అయ్యింది. విన్నర్ రేవంత్ తో పోల్చితే ఈ అమౌంట్ చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news