ఒడిశాకు తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసులు.. తనిఖీల్లో రూ.10 కోట్ల విలువైన మద్యం సీజ్‌

-

ఒడిశాలో తెలంగాణ ఆబ్కారీ శాఖ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మద్యం తయారీ డిస్టిలరీలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా అక్రమ మద్యం, ముడిసరకు, లేబుళ్లను అధికారులు సీజ్‌ చేశారు. దాదాపు రూ.10 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.కోటికి పైగా విలువైన మద్యం ప్యాకింగ్‌ చేసే యంత్రాలు సీజ్‌ చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల నల్గొండ, చౌటుప్పల్‌, రంగారెడ్డిలో భారీగా మద్యం స్వాధీనమైంది. ఒడిశా నుంచి మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. విచారణలో ఎక్సైజ్‌ బృందం భాగంగా ఒడిశాకు వెళ్లారు.

 

రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ రవికాంత్‌ ఆధ్వర్యంలో ఒడిశాకు పయనమయ్యారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రయ్య ఆధ్వర్యంలో ఒడిశాకు వెళ్లిన ఎక్సైజ్‌ బృందం… ఒడిశా పోలీసుల సహకారంతో టాంగీలోని మద్యం తయారీ కేంద్రంలో సోదాలు నిర్వహించారు. భారీగా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులను, ఒడిశాకు చెందిన ఒకరిని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news