Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్షకులను పుల్ మీల్స్ లా ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్న షో ‘బిగ్‌బాస్ సీజన్-5’. విజయవంతంగా 59 రోజులు పూర్తి చేసుకున్న.. బిగ్గెస్ట్ రియాలిటీ షో .. చాలా రసవత్తరంగా సాగుతోంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో వరుసగా సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీదా, శ్వేత, ప్రియ, లోబోలు ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం హౌస్‌లో ఇంకా 11మంది సభ్యులు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ హంగామా మొదలైంది. ‘సూపర్ హీరోస్ vs సూపర్ విలన్స్’ అంటూ ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా వీడకొట్టారు బిగ్ బాస్. యాంకర్ రవి.. జెస్సీ, విశ్వ, యానీ మాస్టర్, సన్నీ సూపర్ విలన్స్ కగా.. సూపర్ విలన్స్ టీంలో షణ్ముఖ్, కాజల్, సిరి, మానస్, ప్రియాంక లు ఉన్నారు. ఈ టాస్క్ లో ఓ రేంజ్ లో రచ్చ జరిగినట్టు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలుస్తోంది.
మరి ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారా? అన్న బిగ్ బాస్ లవర్స్ లో నెలకొంది. కెప్టెన్సీ కంటెస్టెంట్ల టాస్కులో ఇప్పటివరకూ కెప్టెన్ గా అవకాశం రాని రవి, మానస్, ప్రియాంక, ఆనీ మాస్టర్, కాజల్ లు కూడా పోటీదారులుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ వారమైనా… వారిలో ఎవరైనా కెప్టెన్ అవతారమెత్తుతారా? లేక మిగితా వారు కెప్టెన్ బాధ్యతలు చేపడుతారా ? అన్న ఆసక్తి నెలకొంది. ఈ సారి కెప్టెన్ అయ్యేవారికి ఇమ్యూనిటీ పవర్ లభించనున్నది. దీంతో కంటెస్టెంట్ల అందరూ కెప్టెన్సీ కోసం.. పోటాపోటీగా తలపడుతున్నట్టు ప్రోమోలో కనిపిస్తోంది.
యాంకర్ రవిని పడగొడితే.. సూపర్ విలన్స్ టీం అంతా సెట్ అవుతుందని కాజల్‌కు షణ్ముఖ్ చెబుతూ కనిపించారు. ఈ ప్రోమోలో కాజల్ చాలా క్రూయల్ గా కనిపించింది. అనుకున్నట్టుగానే రవిని
ముప్పు తిప్పలు పెట్టినట్టు కనిపించింది. కష్టమైన పనులను చేయించారు. ఈ క్రమంలో తాను బట్టలిప్పి నిలబడమన్నా నిలబడతానని రవి అరవడం కనిపించింది. ఆ తర్వాత రవికి ఒండి నిండా పేడ పూసి.. ఒంటిపై నుంచి పేడ నీళ్లు పోసుకునేట్టు సూపర్ హీరోస్ టీం సభ్యులు చేస్తున్నారు. ఒకే గుటకలో గ్లాస్ కషాయం, ఇతర డ్రింక్స్ తాగమని చెప్పారు సూపర్ హీరోస్ టీం సభ్యులు. అలాగే.. డంబెల్స్ ఉపయోగించిన కఠినతరమైన ఎక్ససైజ్ చేయించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో రవికి వెన్నుముక నొప్పి ఉందని.. జాగ్రత్త అంటూ అనీ మాస్టర్ చెప్పడం కనిపించింది.
అలాగే మానస్.. పింకితో మాట్లాడుతూ.. ఈ సీజనంత నిన్ను అన్నయ్య అని పిలువమని అంటారేమో అని మానస్ అన్నారు. అది మరీ దారుణం అంటూ ప్రియాంక కళ్లు మూసుకొన్నది. ఈ టాస్కులో ఎవ్వరూ ఊహించని విధంగా.. షణ్ముఖ్‌కు సిరికి, విశ్వకు ప్రియాంకల మధ్య వాగ్వాదం జరిగినట్టు కనిపించింది. సింగర్ శ్రీరామచంద్ర కూడా చుక్కలు చూపించినట్టు కనిపించింది. శ్రీరామ్ తలపై ట్రిమర్ పెట్టి భయపెట్టారు. ఈ క్రమంలో ‘ ఇలా గ్రూపులుగా ఆడినంతకాలం నేను కెప్టెన్ అవ్వలేను’ అంటూ అనీ మాస్టర్ వాపోయింది. ఓవరాల్ గా ఈ ప్రోమోను చూస్తే.. టైటిల్ రేసులో టాప్ లో ఉన్న శ్రీరామ చంద్ర, రవిలు ప్రత్యేక టాస్క్‌లు ఇచ్చి ముప్పు తిప్పాలు పెట్టినట్టు తెలుస్తోంది.