Bigg Boss 5 Telugu: సిరిని చీకొట్టిన ష‌న్ను.. త‌ల బాదుకుంటూ వాష్‏రూంలోకి వెళ్లిన సిరి.. నెట్టింట్లో ట్రోలింగ్

-

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మ‌ధ్య గొడవలు కావ‌డం, ఒక‌రిని ఒక్క‌రూ మాటలు అనుకోవ‌డం. ఒక్క‌రిపై ఒక్క‌రూ అలగడం సాధారణం. ఎంత పెద్ద గొడ‌వ‌లు పెట్టుకున్నా.. మళ్లీ తిరిగి కలిసిపోతారు. ఇక నామినేషన్ల‌లో కంటెస్టెంట్ల ప్ర‌వ‌ర్త‌న మ‌రింత దారుణంగా మారుతోంది. మిని సైజ్ యుద్ద‌మే జ‌రుగుతోంది. ఆగ్ర‌హ‌, ఆవేశాల‌తో ఊగిపోతుంటారు. బిగ్ బాస్ హౌస్ లో వ‌చ్చి స్నేహితులుగా మారిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో సన్నీ, మానస్.. సిరి, షణ్ముఖ్, జేస్సీలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మారారు. అయితే షణ్ముఖ్, సిరి.. బిగ్‏బాస్ లోకి రాక‌ముందే మంచి స్నేహితులు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్ ఫిలింస్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా విడుద‌లైన ప్రోమో లో సిరి, ష‌న్నుల మ‌ధ్య ఏదో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప్రోమోలో వీరిద్దరు గొడవ పడుతూ కనిపించారు. షన్ను బాధపడుతున్నాడు. అది చూసినా.. సిరి ష‌న్నుకు న‌చ్చ‌చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. కానీ ష‌న్ను మాత్రం.. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్లిపో.. నా దగ్గరకు రాకు.. అని సీరియ‌స్ అయ్యారు. దీంతో సిరి బాధ‌ప‌డింది. అయినా ష‌న్ను ఓదార్చేందుకు ప్రయత్నించింది.

షణ్ముఖ్‌ను కౌగిలించుకొని సిరి ఏడుపులో మునిగిపోయింది. నాకు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోందని.. ఆమె నా పక్కన ఉంటే బాగుండు.. ఆమె నాతో ఉంటే కింగ్‌లా ఉండేవాడిని.. అన్నాడు. ఈ క్ర‌మంలో సిరి ఇంకో నాలుగు వారాలు ఆగు.. మనం వెళ్లిపోదాం అని సిరి అంటే.. నువ్వు నాకొద్దంటూ ముఖం మీదే చెప్పాడు. అలా అన‌గానే.. సిరి రెండు చేతులతో తలకొట్టుకొన్నది. కంటెస్టెంట్ల అంద‌రూ ఏం జరుగుతున్నదనే ఆలోచనల్లో పడ్డారు.

సిరి ఏడ్చుకుంటూ వాష్‏రూంలోకి వెళ్లి పోయింది. దీంతో వెంటనే షన్ను డోర్ తీయమని బ్రతిమిలాడాడు. కానీ సిరి హన్మంతు ఎంతకు బయటకు రాకపోవడంతో షణ్ముఖ్ వెళ్లి తలుపులు దబాదాబా బాదాడు. దీంతో కంటెస్టెంట్ల అంద‌రూ కంగారు పరుగెత్తుకుంటూ వెళ్లి సిరిని డోర్ తీయమని రిస్వెక్ట్ చేశారు. ఆ తరువాత ఏం జ‌రిగిందో తెలుసుకోవాలంటే.. ఈరోజు ఎపిసోడ్‏లో చూడాల్సిందే. తాజా ప్రోమో నెట్టింట్టో వైర‌లవుతుంది. ష‌న్ను, సిరిల‌ను టార్గెట్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

సిరి, ష‌న్ను యాక్టింగ్ చూసిన త‌రువాత ఓవరాక్షన్ ఎక్కువైంది. మళ్లీ వీళ్ల ర‌చ్చ స్టార్ట్ చేశారో బాబ్బాయ్. మ‌రో వైపు.. వీళ్ల ఎమోషనల్ స్టంట్లు చూడటం కంటే.. సన్నీ అరుపులే బెటర్రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. ష‌న్నుపై కూడా ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. అరేయ్ ఈ బాత్రూంలు కడిగే వాళ్లను ఎక్క‌డ నుంచి ప‌ట్టుకోచ్చార్రా గబ్బు నాయాలా? అంటూ ఘాటు స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news