BIGBOSS 6: ఈవారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఆమేనా..?

-

తెలుగులో బిగ్ బాస్ -6 సీజన్ మరొక రెండు వారాలలో పూర్తి కాబోతోంది. ప్రస్తుతం 13 వ వారం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. అయితే ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం బిగ్ బాస్ ప్రేక్షకులను ఉత్కంఠ పరిచేలా చేస్తోంది. అంతేకాకుండా ఈసారి విన్నర్ ఎవరు అవుతారనే విషయంలో కూడా చాలా గందరగోళం నెలకొంది. అయితే సోషల్ మీడియాలో తెలిపిన కథనాల ప్రకారం రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండబోతున్నట్లుసమాచారం.

ఇక 13వ వారం మరికొన్ని గంటలకు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వార్తలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ వారం నామినేషన్ లో రేవంత్, రోహిత్, శ్రీ సత్య, కీర్తి, ఆదిరెడ్డి, ఫైమా ఈ ఆరుగురు నామినేషన్లు ఉన్నారు. ప్రతి వారం లాగానే ఈవారం కూడా రేవంత్ కి భారీగానే ఓట్లు రావడంతో సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓటింగ్ విషయంలో రోహిత్ రెండవ స్థానంలో ఉన్నారు. ఆదిరెడ్డి మాత్రం మూడవ స్థానంలో.. కీర్తి నాలుగవ స్థానంలో ఉండగా ఐదవ స్థానంలో శ్రీ సత్య.. చివరిగా ఫైమా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వారం మాత్రం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే కచ్చితంగా శ్రీ సత్య, ఫైమా ఇద్దరు కూడా బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లేదంటే ఒకే ఎలిమినేషన్ అయితే పైమా బయటికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారంలో కూడా ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండడం వల్ల ఈమె గతవారం ఎలిమినేట్ కాకుండా సేఫ్ జోన్ లో ఉందని చెప్పవచ్చు. మరి ఈ వారం కూడా డేంజర్ జోన్ లో ఉండడంతో ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news