Bigboss 6: హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 21 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే..!

-

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు హిందీలో మొదలైన ఈ షో ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా ప్రసారమవుతుంది. ప్రేక్షకులను మరింతగా ఆకట్టు కుంటోంది. ఇక సెలబ్రిటీలను ఒకే హౌస్ లో వుంచి వారి మధ్య సంబంధాలను ఏర్పాటు చేసే పనిలోని మరోపక్క టాస్కులు ,గేములు పెట్టి వారి చేత ప్రేక్షకులకు ఆనందాన్ని కలుగజేస్తోంది. అంతేకాదు గెలిచిన వారికి సుమారుగా కొన్ని లక్షల రూపాయలను బహుమతిగా ఇవ్వడమే కాకుండా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కి ట్రోఫీని కూడా అందిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకోవడం.. మరోపక్క నాన్ స్టాప్ ఓటిటి బిగ్ బాస్ ని కూడా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఇటీవల ఆరవ సీజన్ ను కూడా మొదలుపెట్టింది . ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ రియాల్టీ షో నిన్న అనగా సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం అయింది.Bigg Boss 6 Telugu Premiere Event: The Official List Of Contestants - Filmibeat

ఇకపోతే ఈ షో కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు.. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ లు ఎవరెవరు వస్తారు అనే విషయం చాలా వైరల్ గా మారుతుండగా ఎట్టకేలకు 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడం జరిగింది. ఇక ఆ కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయానికి వస్తే కార్తీకదీపం సీరియల్ నటి కీర్తి, నువ్వు నాకు నచ్చావ్ సినిమా పింకీ అలియాస్ సుదీప, సిరి బాయ్ ఫ్రెండ్ ప్రముఖ యూట్యూబ్ శ్రీహాన్, ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరి, జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి, ప్రముఖ నటి శ్రీ సత్య, షార్ట్ ఫిలిమ్స్ హీరో అర్జున్ కళ్యాణ్, జబర్దస్త్ లేడీ కమెడియన్ గీతూ రాయల్, నటి అభినయశ్రీ, ప్రముఖ సీరియల్ నటి మెరీనా, ఆమె భర్త నటుడు రోహిత్ కూడా హాజరయ్యారు.

ఇక హీరో బాలాదిత్యాతో పాటు సీరియల్ నటి వాసంతి, షానీ సల్మాన్, వినయ సుల్తానా, ఆర్ జె సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహి రావు, సింగర్ రేవంత్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇక మరి వీరు ఎవరు ఎన్ని రోజులు ఉంటారో ? టైటిల్ విన్నర్ ఎవరు గెలుస్తారో ? అనే విషయం తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news