బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్స్‌ రెమ్యునిరేషన్‌ వివరాలివే.. అతనికి మరీ తక్కువ, నాగార్జునకు ఎపిసోడ్‌కు అన్ని లక్షలా..?

-

బిగ్ బాస్ సీజన్ 7 సీజన్‌ మొదట కాస్త బోరింగ్‌గా అనిపించినా.. ఆట ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా నామినేషన్స్ ఎపిసోడ్‌తో మంచి హైప్ వచ్చింది. ఇంతకు ముందు సోమవారం ఒక్కరోజే నామినేషన్స్‌ ఉండేవి. కానీ ఈ సీజన్‌లో నామినేషన్లు రెండు రోజులు సాగుతున్నాయి. మొత్తం 15 వారాలు పాటు సాగే ఈ ఉల్టా పుల్టా సీజన్‌లో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. అయితే ఈ కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్‌ ఎంత రెమ్యునిరేషన్‌ ఇస్తుంది..? ఎవరిది ఎక్కువ, ఎవరిది తక్కువ ఒకసారి చూద్దామా..! ఎందుకంటే.. ఒక్కొక్కరి లెక్కలు ఒక్కోలా ఉన్నాయి..!!

హోస్ట్‌ నాగార్జునకు ఎంతంటే..

మొదటిగా హోస్ట్ నాగార్జునతోనే మొదలుపెడదాం. మూడో సీజన్ నుంచి వరుసగా ఏడో సీజన్ వరకూ అంటే.. 3, 4, 5, 6, 7 సీజన్లతో పాటు.. ఓటీటీ సీజన్‌కి కూడా నాగార్జునే హోస్ట్. కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ వారం లెక్కన పే చేస్తే.. హోస్ట్ నాగార్జున రెమ్యూనరేషన్ మాత్రం ఎపిసోడ్ లెక్కల్లో. ఒక్క ఎపిసోడ్‌కి రూ.12 లక్షలు చార్జ్ చేస్తారట. అంటే వారానికి రెండు ఎపిసోడ్‌లు.. అంటే రూ.24 లక్షలు. మొత్తం 15 వారాలు.. అంటే రూ.1.80 కోట్లు. ఇక ప్రోమోలు స్పెషల్ ఈవెంట్స్.. ప్రమోషన్స్ కార్యక్రమాలతో కలుపుకుని ఈ సీజన్‌కి హోస్ట్ నాగార్జునకి అందుకున్న రెమ్యూనరేషన్ రూ.3 కోట్లు పైమాటేనట.

ప్రియాంక జైన్.

ప్రియాంక జైన్‌కు వారానికి రూ.2.5 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటుందట. అంటే ఈమె రూ.15 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో ఉందంటే.. వారానికి రూ.2.5 లక్షల చొప్పున మొత్తం 15 వారాలకు రూ. 37.5 లక్షలు అందుకోబోతుందట.

శివాజీ..

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ సీనియర్ మోస్ట్ హీరో శివాజీ. ఇతనికి వారానికి రూ.4.5 లక్షల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అంటే మొత్తం 15 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే.. శివాజీ రెమ్యూనరేషన్ అక్షరాలా రూ.60 లక్షలన్నమాట. అంటే.. బిగ్ బాస్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువే.

ప్రిన్స్ యావర్

బిగ్ బాస్ హౌస్‌లో కనిపిస్తున్న ఈ కండల వీరుడు.. తెలుగులో పెద్దగా పాపులర్ నటుడు కాకపోవడంతో వారానికి రూ.1.5 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అంటే 15 వారాలు ఇతను హౌస్‌లో ఉంటే రూ.22.5 లక్షలు వస్తాయన్నమాట.

శోభాశెట్టి

కార్తీకదీపం సీరియల్‌లో మోనితగా ఓ రేంజ్‌లో క్రేజ్ రాబట్టిన శోభాశెట్టి.. ఆ సీరియల్ తరువాత కనిపించడం మానేసింది. ఆమె కూడా బిగ్ బాస్ 7కి రెండు నెలల ముదే కన్ఫామ్ అయ్యింది. దాంతో మరే ఇతర ప్రాజెక్ట్స్‌కి ఒప్పుకోలేదు. అయితే ఈమెకి వారానికి రూ.2.5 లక్షలు ఆఫర్ చేశారట. ఆ లెక్కన చూస్తే.. మొత్తం 15 వారాలకు గానూ.. 37.5 లక్షల రెమ్యూనరేషన్ అందుకోబోతుందట. అయితే బుల్లితెరపై మోనిత విలనిజం పండించిన శోభాశెట్టి.. రియల్ లైఫ్‌లో అంతకు మించిన విలనిజం చూపిస్తుంది. ఓరకంగా ఆ మోనితే బెస్ట్ అబ్బా.. ఈ శోభాశెట్టి కంటే అనేట్టుగా ప్రవర్తిస్తుంది.

రతిక

రతిక రెమ్యూనరేషన్ వారానికి రూ.2 లక్షలపైనే. ఒకసారి ఎలిమినేట్‌ అయి మళ్లీ రావడం బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఈ తెలంగాణ పోరీని బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

పల్లవి ప్రశాంత్

ఈ సీజన్ కంటెస్టెంట్స్‌లో తక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసింది ఇతనికేనట. ఆదాయాన్ని బట్టి రెమ్యూనరేషన్ రేటుని ఫిక్స్ చేస్తుంటారు. కాబట్టి.. పల్లవి ప్రశాంత్ కూలి చేసుకునే సాధారణ రైతు. కాబట్టి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే చాలు అనుకున్నాడట. దీంతో రెమ్యూనరేషన్ కూడా తక్కువే ఫిక్స్ చేశారు. ఇతనికి వారానికి రూ.1 లక్ష చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. మొత్తం 15 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే.. రూ.15 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటాడు పల్లవి ప్రశాంత్.

అమర్ దీప్ చౌదరి.

సీరియల్ హీరోగా క్రేజ్ సంపాదించిన అమర్ దీప్ చౌదరికి వారానికి రూ.2.75 లక్షల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. మొత్తం రూ.15 వారాలు హౌస్‌లో ఉంటే దాదాపు రూ.42 లక్షలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు. టాప్ 5లో ఎవరు ఉన్నా లేకపోయినా అమర్ దీప్ మాత్రం ఉండే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

గౌతమ్ కృష్ణ.

ఆకాశవీధుల్లో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ.. రెండో సినిమాని కూడా లైన్‌లో పెట్టాడు. ఇతని రెమ్యూనరేషన్ వారానికి రూ.1.75 లక్షలట. ఆ లెక్కన మొత్తం 15 వారాలకు దాదాపు రూ26 లక్షలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడట గౌతమ్.

కిరణ్ రాథోడ్.

బిగ్ బాస్ హౌస్ నుంచి తొలివారమే వెళ్లిపోయిన కిరణ్ రాథోడ్‌‌కి క్రేజ్ అయితే మామూలుగా లేదు. వారానికి 3.5 లక్షలు ఆఫర్ చేశారట. ఈమె హౌస్‌లో ఉన్నది ఒక్క వారమే కావడంతో మూడున్నర లక్షలతోనే సరిపెట్టుకుందట.

షకీలా

ఈ సీజన్‌లో వారానికి రూ. 3 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుందట షకీలా. గతంలో కన్నడ బిగ్ బాస్‌కి సైతం వెళ్లింది ఈమె వారానికి రూ.3 లక్షల చొప్పున తీసుకుంది.

సింగర్ దామిని.

ప్రతి సీజన్‌లోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా సింగర్స్‌ను హౌస్‌లోకి పంపుతుంటారు. సింగర్ దామిని వారానికి రూ.2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకుందట.

శుభ శ్రీ రాయగురు.

పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీకి రేటు బాగానే పలికింది. వారానికి రూ.2 లక్షలు చొప్పున రెమ్యూనరేషన్ అందుకుందట.

ఆట సందీప్

నీతోనే డాన్స్ విన్నర్ అయిన ఆట సందీప్.. ఆ వెంటనే బిగ్ బాస్ హౌస్‌ లోకి వెళ్లాడు. కొరియోగ్రాఫర్‌గా నటుడిగా బాగానే సంపాదిస్తున్న ఆట సందీప్‌కి బిగ్ బాస్ నుంచి మంచి రేటే పలికిందట. వారానికి రూ.2.75 లక్షలు రెమ్యూనరేషన్ అందుకున్నాడు.

టేస్టీ తేజా

యూట్యూబర్ టేస్టీ తేజాకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇతనికి వారానికి రూ.1.5 లక్షల చొప్పున రెమ్యూనరేషన్‌ పుచ్చుకున్నాడు.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో వచ్చిన వాళ్లకు ఎంత ఇస్తున్నారంటే..

అర్జున్ అంబటికి అత్యధికంగా వారానికి రూ. 4.5 లక్షలు, హాట్ బ్యూటి నయని పావనికి వారానికి రూ. 2.5 లక్షలు, పూజా మూర్తికి రూ. 1.5 లక్షలు, సింగర్ భోలేకు రూ. 1.5 లక్షలు, అశ్వినికి వారానికి 2 లక్షలు ఆఫర్‌ చేశారట. మొత్తంగా చూసుకుంటే శివాజికి, అర్జున్‌కు పారితోషకం ఒకేలా ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news