తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది : రేవంత్ రెడ్డి

-

ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపడుతున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కలిసింది. రేవంత్ రెడ్డి కోసం ప్రేమతో ఆమె మిర్చి బజ్జీ తీసుకురాగా, ఆయన ఎంతో ఇష్టంగా ఆరగించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. గంగవ్వ తెలంగాణకు పరిచయం అక్కర్లేని అవ్వ అని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి కోసం మిర్చి బజ్జీ తీసుకువచ్చిన 'బిగ్ బాస్' ఫేమ్ గంగవ్వ

ప్రపంచానికి తనొక సెలబ్రిటీ అని తెలిపారు. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నాకోసం ఆప్యాయంగా, నాకు ఇష్టమైన మిర్చి బజ్జీ తీసుకువచ్చి, తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది. యాత్రలో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా. నా అనుభవాలను నా తల్లితో ఇలాగే ముచ్చటించేవాడిని. తల్లిని గుర్తుచేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news