అరుణ్ రామచంద్రపిళ్ళై రిమాండ్ రిపోర్టులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ రిపోర్టులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. లిక్కర్ స్కాం లో పిళ్ళై ని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించింది. మొదటినుంచి అరుణ్ ఢిల్లీ లిక్కర్ స్కాం లో కీలకంగా వ్యవహరించారని ఎన్ఫోర్స్మెంట్ ఆరోపించింది.

అరుణ్ కవిత బినామీ అని ఈడి ఆరోపించింది. కవిత చెప్పినట్లుగానే అరుణ్ నడుచుకున్నాడని పేర్కొంది. తాను కవిత ప్రతినిధినని అరుణ్ అనేకమార్లు స్టేట్మెంట్ ఇచ్చాడని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్ స్థాపనలో అరుణ్ పిళ్లై కీలక పాత్ర పోషించారని.. కాగితాలపై మూడున్నర కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పిళ్లై చూపారని తెలిపింది ఈడి. అందుకు ప్రతిఫలంగా కవిత ఆదేశాలతో అరుణ్ కి కోటి రూపాయలు ఇచ్చినట్లు రిపోర్ట్ లో వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news