BIGG BOSS OTT : టాప్ లేచిపోవడం ఖాయం.. 17 కంటెస్టెంట్స్ వీళ్లే

-

తెలుగు లో బిగెస్ట్ రియాల్టీ షోగా పేరు తెచ్చుకుని సక్సస్ ఫుల్ గా 5 సీజ‌న్ల ను పూర్తి చేసుకుంది. తాజా గా బిగ్ బాస్ ను 24 గంట‌లు ప్ర‌సారం చేయ‌డానికి డిస్పీ + హట్ స్టార్ అనే ఓటీటీ వేదిక ద్వారా బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే పేరుతో ముందుకు వ‌స్తుంది. శ‌నివారం సాయంత్రం అట్ట‌హాసంగా ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభం అయింది. కింగ్ నాగ‌ర్జున హోస్టు గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ రియాల్టీ షో కు మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ వ‌చ్చారు.

ఇక హౌస్ లోకి ఆషు రెడ్డి మొద‌టి కంటెస్టెంట్ గా హాట్ ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా నాగ‌ర్జునకే ముద్దు పెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంత‌రం రెండో కంటెస్టెంట్ గా క‌మెడియ‌న్ మ‌హేశ్ విట్టా ఎంట్రీ ఇచ్చాడు. మూడో కంటెస్టెంట్ గా హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ సిజ‌న్ 1 లోనూ ముమైత్ ఖాన్ పాల్గొంది. అలాగే 4వ కంటెస్టెంట్ గా అజ‌య్ అనే కొత్త కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. రెండు సినిమాల్లో న‌టించాన‌ని.. ప్ర‌స్తుతం ఒక సినిమాలో హీరో గా న‌టిస్తున్నాని అజ‌య్ చెప్పాడు.

5 వ కంటెస్టెంట్ గా యాంకర్ స్ర‌వంతి చొక్కార‌పు ఎంట్రీ ఇచ్చింది. త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు పెళ్లి అయింద‌ని చెప్పింది. ఒక సారి పారిపోయి పెళ్లి చేసుకున్నాన‌ని, త‌ర్వాత అత‌న్నే కుటుంబ స‌భ్యుల ముందు పెళ్లి చేసుకున్న‌ట్టు తెలిపింది. 6వ కంటెస్టెంగా ఆర్జే చైతూ ఎంట్రీ ఇచ్చాడు. 7వ కంటెస్టెంట్ గా బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ – 4 చివ‌రి వ‌ర‌కు వెళ్లింది. అలాగే బిగ్ బాస్ -5 సీజ‌న్ కి గాను బిగ్ బాస్ బ‌జ్ కి హోస్ట్ గా వ్య‌వ‌హరించింది.

8 వ కంటెస్టెంట్ గా న‌ట‌రాజ్ మాస్ట‌ర్, 9 వ కంటెస్టెంట్ గా శ్రీ రాపాక ఎంట్రీ ఇచ్చారు. అలాగే 10 వ కంటెస్టెంట్ గా మోడ‌ల్ అనిల్ రాథోడ్, 11వ కంటెస్టెంట్ గా న‌టి మిత్ర శ‌ర్మ‌, 12 వ కంటెస్టెంట్ తేజ‌స్వీ, 13 కంటెస్టెంట్ గా స‌ర‌యు, 14 వ కంటెస్టెంట్ యాంక‌ర్ శివ‌, 15వ కంటెస్టెంట్ గా హీరోయిన్ బిందు మాధ‌వి ఎంట్రీ ఇచ్చారు. బింధు మాధ‌వి.. అవ‌కాయ బిర్యానీ, రామ రామ‌, కృష్ణ కృష్ణ వంటి సినిమాల్లో హీరోయిన్ గా న‌టించింది.

16 వ కంటెస్టెంట్ గా హ‌మిదా, చివ‌రికి 17 వ కంటెస్టెంట్ గా అఖిల్ సార్థ‌క్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇప్ప‌టి నుంచి 24 గంట‌లు డిస్ని + హట్ స్టార్ 24 గంట‌లు బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్ర‌సారం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news