Bigg Boss Telugu 5 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే 6 వారాలు పూర్తి కాగా, ఈ రోజు ఆరో ఎలిమినేషన్ జరుగనున్నది. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతుందనే టాక్ వైరల్ అవుతుంది. ఈ రియాల్టీ షోలో ఫేక్ ఎలిమినేషన్లు, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు చూస్తునే ఉంటాం. గత సీజన్లలో దీక్షాసేత్, పూజా, కుమార్ సాయి, ముక్కు అవినాష్, స్వాతి దీక్షిత్.. ఇలా కొంతమంది వైల్డ్‌కార్డ్ ద్వారా హౌస్ లో ఏంట్రీ ఇచ్చారు. అయితే .. ఈ సీజన్ లో ఎప్పుడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లను హౌస్లోకి పంపారు.
సో.. ఈ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీకి ఛాయిస్ లేనట్లే.. అనే టాక్ కూడా వచ్చింది. కానీ ఆ మధ్య కాలంలో యాంకర్ వర్షిణి, విష్ణుప్రియలు వైల్డ్ కార్డు ఏంట్రీ ద్వారా అడుగు పెట్టబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. కానీ, అవి అన్ని పుకార్లు మాత్రమేనని తేటతెల్లమయ్యింది. ఇదిలా ఉంటే.. మరోసారి తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వారం ఓ హాట్ బ్యూటీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ కంటెస్టెంట్ ఎవరు అనేది ఇప్పటి వరకూ కూడా సరైన క్లారిటీ లేదు. దానిమీద ఇప్పటి దాకా సరైన క్లారిటీ లేక పోగా ఒక పేరు మాత్రం ఎప్పటి నుంచి వినిపిస్తోంది.
ఎవ్వరూ ఊహించని విధంగా హాట్ బ్యూటీ ప్రీతి అన్షు పేరు తెర మీదికి వచ్చింది. ఈ మేరకు బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ సోషల్ మీడియలో ప్రచారం ఊపందుకుంది.
దీంతో ఇంతకీ ఆమె ఎవరా? ఏం చేస్తుంది? అనే వివరాల కోసం నెట్టింట్లో గాలింపు ప్రారంభించారు బిగ్ బాస్ లవర్స్. ప్రీతి అన్షు ఒక మోడల్. మై దిల్ అనే షార్ట్ ఫిలింలోనూ నటించింది.
అయితే పెద్దగా గుర్తింపు లేని ఆమెకు బిగ్‌బాస్ ఆఫర్ ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని జశ్వంత్, హమీద లాంటి వారిని పంపి ట్రోల్స్ కు బలయ్యారు బిగ్ బాస్. ఇప్పుడు.. అదే తరహా రిస్క్ చేస్తారా అనేది. ప్రశ్నర్థకంగా మారింది. మరోవైపు.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం మీద అధికారికంగా బిగ్ బాస్ క్లారిటీ ఇస్తే గాని ఏమీ చెప్పలేము.