బిగ్ బాస్ విన్నర్ తండ్రి మృతి …దుఃఖంలో కుటుంభం …!?

-

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే విషయం బిగ్ బాస్ .బిగ్ బాస్ 4 ముగిసి ఇంకా ఒక్క రోజు కూడాపూర్తి కాలేదు .దాంతో ఇప్పుడు అంత దానికి గురించే మాట్లాడుతున్నారు .ముఖ్య0గా సోషల్ మీడియాలో కూడా అదే చర్చ జరుగుతుంది .అభిజిత్ విన్నర్ కావటం సోహెల్ మూడవ స్థానం లో ఉండి 25 లక్షల రూపాలు సంపాదించుకోవడం ,రన్నరప్ అయి కూడా అఖిల్ ఆటలో అరటిపండుగ మారిపోవటం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నయి .ఇంత లోనే ఓ చేదు వార్త వచ్చింది .బిగ్ బాస్ కుటుంబంలో విషాదం జరిగింది .ఈ షో కేవలం తెలుగు లోనే కాదు ,తమిళ్ ,కన్నడ ,మలయాళం ,హిందీ తో పాట్లు మరిన్ని భాషల్లో ప్రేక్షకులను అలరిస్తుంది . అలంటి బిగ్ బాస్ పాపులర్ ఐన ఓ విన్నర్ తండ్రి కన్నుమూశారు

తెలుగుతో పాటు తమిళం లో బిగ్ బాస్ ఒకేసారి మొదలు పెట్టారు . ఇక్కడ తొలి సీజన్లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా గా చేస్తే అక్కడ మొదటి నుంచి కమల్ హాసన్ వ్యాఖ్యాతగా చేశారు. తమిళ బిగ్ బాస్ సీసన్ 1 విన్నర్ ఆరవ్ నఫీస్ ఇంట విషాదం జరిగింది .ఆయన తండ్రి గుండె పోటుతో మృతి చెందారు .చెన్నై లో ఆయన మృతి చెందగా ..అంత్యక్రియలను స్వస్థలం నాగర్కోల్ లో జరిపించారు కుటింబీకులు . మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నఫీస్…2016 లో వచ్చిన బేతాలుడుతో నటుడిగా పరిచయం అయ్యాడు .ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ కి వచ్చాడు . విన్నర్ అయ్యాడు . ఇప్పటికి సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఆరవ్ .ఆయన తండి మరణ వార్త తెల్సి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు

.ఇది ఇలా ఉంటే తెలుగు బిగ్ బాస్ సీసన్ 4 లో విజయం సాధించిన అభిజిత్ కి ఆఫర్స్ వర్షం కురుస్తుందని చెప్పాలి . అతని బిగ్ బాస్ ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది .ఇప్పటి వరకు అభిజిత్ కి రెండు సినిమా అవకాశాలు ,12 వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందట.

Read more RELATED
Recommended to you

Latest news