ఇదివరకు సినిమా థియేటర్ లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసేవారు. కానీ ఆ తరవాత పార్కింగ్ ఫీజు ను ఎత్తివేశారు. అయితే తాజాగా మళ్లీ థియేటర్స్ లో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థియేటర్ లు పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా చూసేందుకు వచ్చే వాళ్లే కాకుండా బయటివాళ్లు కూడా వచ్చి పార్కింగ్ చేస్తున్నారని థియేటర్ యాజాన్యాలు ప్రభుత్వానికి తెలిపింది.
అంతే కాకుండా ఆ వాహనాల భద్రత తమకు సవాల్ గా మారింది అని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే అనుమతి ఇచ్చింది. ఇక ఈ నిర్ణయం తో సినిమా లవర్స్ కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటి నుండి మళ్లీ సినిమా టికెట్ తో పాటు పార్కింగ్ ఫీజు కింద బైకు కు 20 పెద్ద వాహనాలకు అంతకంటే ఎక్కువే చెల్లించాల్సి ఉంటుంది.