బీహార్ ఎన్నికలు : ప్రధాని మోదీ కి ఆ ధైర్యం ఉందా..?

-

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం బీహార్ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ప్రజల చెంత వాలిపోయి హామీల వర్షం కురిపిస్తున్నారు. మరోసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి అధికారం చేపట్టాలని భావిస్తూ ఉంటే… ఈ అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీయే కూటమిని చీల్చి ఎలాగైనా విజయం సాధించాలని అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇక అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ప్రచార మధ్య బీహార్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి.

అయితే ఇప్పటికే బిజెపి పెద్దలు రంగంలోకి దిగి బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోడీ 12 కోట్ల మంది బీహార్ ప్రజల ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కాదు బీహార్ కి ప్రత్యేక హోదా ప్రకటించే ధైర్యం ప్రధాని నరేంద్ర మోడీకి ఉందా అంటూ ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news