ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్స్ వడ్డీ రేట్లు ఎంత చెల్లిస్తున్నాయో తెలుసా..?!

-

కరోనా నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో ఆ ప్రయోజనాలను బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. గత కొంతకాలంగా హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా తగ్గి కస్టమర్లు బ్యాంకులో దాచుకునే డబ్బుకు తక్కువ వడ్డీ వస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్సీ 2.9 శాతం నుండి 5.5 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి.

ఇక SBI ఎఫ్డీ వడ్డీ రేట్లు ఎలా అందిస్తుందంటే.. 7 – 45 రోజులకు అందరికీ 2.9% – సీనియర్ సిటిజన్లకు 3.4%, 46 – 179 రోజులకు అందరికీ 3.9% అలాగే సీనియర్ సిటిజన్లకు 4.4%, 180 – 210 రోజులకు అందరికీ 4.4% అలాగే సీనియర్ సిటిజన్లకు 4.9%, 211 రోజులకు 1 సంవత్సరం లోపు అందరికీ 4.4% ఉండగా సీనియర్ సిటిజన్లకు 4.9%, 1 – 2 సంవత్సరాల లోపు అందరికీ 4.9% అలాగే సీనియర్ సిటిజన్లకు 5.4%, 2 – 3 సంవత్సరాలకు అందరికీ 5.1% అలాగే సీనియర్ సిటిజన్లకు 5.6%, 3 – 5 సంవత్సరాల లోపుకి అందరికీ 5.3% ఇవ్వనుండగా సీనియర్ సిటిజన్లకు 5.8%, ఇక 5 – 10 సంవత్సరాలు ఉన్నవారికి అందరికీ 5.4% అలాగే సీనియర్ సిటిజన్లకు 6.2% ఇవ్వనుంది.

ప్రయివేటు బ్యాంకు దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిపాజిట్ రేట్లను 10 బేసిస్ పాయింట్ల నుండి 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 22 నుండి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తరుణంలో 15 నెలల డిపాజిట్ పైన 5.7 శాతం, 22 నెలల కాలపరిమితి పై 5.8 శాతం, 30 నెలల కాలపరిమితి పై 5.75 శాతం, 44 నెలలకు 6.1 శాతం, 66 నెలలకు 6.25 శాతం వడ్డీ వస్తుంది. ఏడాది కాలపరిమితి పై 5.5 శాతం వడ్డి, అయిదేళ్ల కాలపరిమితి పై 6.7 శాతం వడ్డీ ఇస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.2 కోట్ల లోపు వడ్డీ పై ఇచ్చే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 – 29 రోజులకు అందరికీ 2.50% ఇవ్వనుండగా సీనియర్ సిటిజన్లకు 3.00%, 30 – 90 రోజులకు అందరికీ 3.00% ఇవ్వనుండగా సీనియర్ సిటిజన్లకు 3.50%, 91 రోజులు – 6 నెలలకు అందరికీ 3.50% ఇవ్వనుండగా సీనియర్ సిటిజన్లకు 4.00%, 6 నెలల 1 రోజు – ఏడాది లోపువారికీ అందరికీ 4.40% ఇవ్వనుండగా సీనియర్ సిటిజన్లకు 4.90%, 1 సంవత్సరం – అందరికీ 4.90% ఇవ్వనుండగా సీనియర్ సిటిజన్లకు 5.40%, 1 సంవత్సరం 1 రోజు నుండి 2 సంవత్సరాలకు అందరికీ 5.00% ఇవ్వనుండగా సీనియర్ సిటిజన్లకు 5.50%, 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు అందరికీ 5.15% ఇవ్వనుండగా సీనియర్ సిటిజన్లకు 5.65%, 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాలు వారికీ అందరికీ 5.30% ఇవ్వనుండగా సీనియర్ సిటిజన్లకు 5.80%, 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాలు వారికీ అందరికీ 5.50% ఇవ్వనుండగా సీనియర్ సిటిజన్లకు 6.25% ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news