వ‌ర్షాకాలంలో పాదాలు జ‌ర జాగ్ర‌త్త‌..!

-

స‌హ‌జంగా వ‌ర్షాకాలంలో అనేక రోగాల‌కు గుర‌వుతుంటారు. మ‌రియు అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఈ క్ర‌మంలోనే వ‌ర్షాకాలంలో పాదాల స‌మ‌స్య‌ల‌తో చాలా మంది ఇబ్బంది ప‌డాతారు.  తేమ వల్ల పాదాలు ఎక్కువ‌గా పాడవుతుంటాయి.  ఈ సీజన్‌లో బురద నీటిలో నడవడం వల్ల, వర్షపు నీటిలో పాదలు నానడం వల్ల వ‌చ్చే బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి పాదాలను కాపాడుకోవాలి. లేక‌పోతే అనేక ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

వర్షాకాలంలో మన పాదాలు ఎక్కువగా మురికిబారిన పడుతుంటాయి. ఈ క్రమంగా మట్టి మరియు దుమ్ము కారణంగా అంటువ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. పాదాలు శరీరంలో అత్యంత కీలకమైన భాగం, కావున వీటిపట్ల మరింత శ్రద్ధ కలిగిఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ‌ర్షాకాలంలో పాదాలు ప‌దిలంగా ఉండాలంటే ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్తులు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

– వర్షాకాలంలో పాదాలకు పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి.. పాదాలకు ఉన్న మృతచర్మం తొలగిపోయేలా స్క్రబ్బర్‌తో రుద్దాలి. డెడ్ స్కిన్‌ను తొలగిస్తే పాదాల పగుళ్లు త‌గ్గుతాయి.

–  ప్ర‌తి రోజు రాత్రి తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత కొబ్బరినూనె రాస్తూ, కొద్దిసేపు పాదాలను మర్దన చేస్తే పాదాల‌పై పేరుకున్న మురికి, క్రిములు తొల‌గుతాయి.

– వ‌ర్షాకాలంలో ప్ర‌తి రోజు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆల్మండ్‌ ఆయిల్‌ లేదా ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసుకోవడం చాలా ఉత్త‌మం.

– వేపాకులను పేస్ట్‌లా చేసి ఇక స్పూన్‌ పసుపు కలిపి పాదాలకు ప్యాక్‌ వేయాలి. ఆరిన తర్వాత షాంపూతో రుద్ది కడిగితే పగుళ్ల సమస్య తగ్గిపోతుంది.

– వ‌ర్సాకాలంలో బ‌య‌ట తిరిగి వ‌చ్చాక పాదాలు దుర‌ద‌గా అనిపిస్తాయి. అప్పుడు కొద్దిగా నిమ్మ రసం, వెనిగ‌ర్ మిక్స్ చేసి దుర‌ద ఉన్న చోట రాస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

– వర్షాకాలంలో త‌ర‌చూ షూస్ వేసుకోకూడ‌దు. ఎందుకంటే వర్షంలో తడిసినపుడు షూస్‌లో ఉన్న‌ తేమ‌ పాదాలకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది.

–  రోజ్‌ వాటర్‌, గ్లిజరిన్ ఈక్వ‌ల్‌గా తీసుకొని రాత్రివేళ పాదాలకు మర్దన చేయాలి. మార్నింగ్ గోరువెచ్చటినీళ్లలో షాంపూ కలిపి పాదాలను కడిగితే, మురికి సులువుగా తొలగిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news