మరోసారి హాట్ లుక్ తో అదరహో అనిపిస్తున్న బిందు మాధవి..!!

-

ప్రముఖ హీరోయిన్ తెలుగు అమ్మాయి బిందు మాధవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈమె తెలుగులో అవకాశాలు తగ్గుతున్న సమయంలో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అక్కడ బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా ప్రేక్షకులను మెప్పించి బిగ్ బాస్ ద్వారా భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఈమె అదే క్రేజీతో తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలోకి అడుగు పెట్టింది. ఆడపులిలా విజృంభించి తనకు పోటీ వచ్చిన వారిని ధైర్యంగా ఎదుర్కొని , కష్టాలు, నష్టాలు, బెదిరింపులు ఎన్నో ఓర్చుకొని చివరికి టైటిల్ విన్నర్ గా ట్రోఫీ ను సొంతం చేసుకుంది బిందు మాధవి. ఇకపోతే సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బిందు మాధవి అప్పుడప్పుడు కొన్ని హాట్ ఫోటోలను వదులుతూ కుర్ర కారుమతులు పోగొడుతూ ఉంటుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్స్ నుండీ పాజిటివ్ గా రెస్పాన్స్ కూడా అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం గ్రీన్ కలర్ వన్ పీస్ గౌన్ వేసుకొని చూపర్లను బాగా ఆకట్టుకుంటున్న బిందు మాధవిని చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.bindumadhavi - Twitter Search / Twitter

ఇక అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఒక సినిమాలో బిందు మాధవి నటించబోతోంది. ఇక అంతే కాదు మలయాళం లో కూడా ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.bindumadhavi - Twitter Search / Twitter

మలయాళం మెగాస్టార్ మోహన్లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ సినిమాలో ఈమె నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక అంతేకాదు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది బిందు మాధవి.

 

 

 

View this post on Instagram

 

A post shared by Bindu Madhavi (@bindu_madhavii)

Read more RELATED
Recommended to you

Latest news