విశాఖకు భారీ ప్రాజెక్టు.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

-

వైజాగ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. విశాఖపట్నంలో బయోటెక్నాలజీ పార్కు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ విషయాన్నీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కు బయో ఇంక్యుబేషన్ సెంటర్ లపై బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన మూడు బయో ఇంక్యుబేషన్ సెంటర్లలో రెండు విశాఖపట్నంలో, ఒకటి తిరుపతిలో ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు రాజ్యసభలో ఇంక్యుబేషన్ సెంటర్ లపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 75 ఇంక్యుబేషన్ సెంటర్లను మంజూరు చేయగా, మూడు బయో ఇంక్యుబేషన్ సెంటర్లు ఆంధ్ర ప్రదేశ్ కు మంజూరైనట్టు వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా 8 బయోటెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి తన సమాధానంలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news