కొత్త వైరస్ కి ఆరు వారాల్లో వ్యాక్సిన్ ఇస్తాం: బయో ఎంటెక్

-

యునైటెడ్ కింగ్‌డమ్‌ లో గుర్తించిన కొత్త కరోనా వైరస్ ను ఆరు వారాల్లో కట్టడి చేస్తామని ఒక కీలక సంస్థ సంచలన ప్రకటన చేసింది. కొత్త కరోనా వైరస్ మ్యుటేషన్‌ కు వ్యతిరేకంగా టీకాను ఆరు వారాల్లో తయారు చేయవచ్చని బయోఎంటెక్ మంగళవారం తెలిపింది. బయోఎంటెక్ సహ వ్యవస్థాపకుడు ఒకరు మాట్లాడుతూ దీనిపై ప్రకటన చేసారు. వ్యాక్సిన్ ని కచ్చితంగా ఆరు వారాల్లో తయారు చేయడం ఖాయమని…

తమ సంస్థకు ఆ సత్తా ఉందని పేర్కొంది. “శాస్త్రీయంగా, ఈ టీకా ద్వారా రోగనిరోధక ప్రతిస్పందన కొత్త వైరస్ వేరియంట్‌ ను కూడా కట్టడి చేసే అవకాశం ఉంది అని ” అని ఉగూర్ సాహిన్ అన్నారు. యుకె వేరియంట్‌లోని ప్రోటీన్లు ప్రస్తుతం ఉన్న జాతుల మాదిరిగానే 99 శాతం ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కొత్త మ్యుటేషన్‌ ను పూర్తిగా కట్టడి చేసే వ్యాక్సిన్‌ ను ఇంజనీరింగ్ చేయడం తాము నేరుగా ప్రారంభించగలము అని ఆయన వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా ఆగ్నేయ ఇంగ్లాండ్ లో కొత్త కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ కొత్త కరోనా వైరస్ వేరియంట్, ప్రపంచవ్యాప్తంగా మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇది మరింత సులభంగా వ్యాప్తి చెందుతుందనే సంకేతాలు ఉన్నాయి. ఇది మరింత తీవ్రమైన అనారోగ్యానికి కారణమయ్యే సూచనలు లేనప్పటికీ, యూరప్ మరియు వెలుపల అనేక దేశాలు జాగ్రత్తలు పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news