గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.. కాని ఒకరోజులో ఎన్ని గుడ్లు తినాలో తెలుసా..?

-

గుడ్డులో ఉండే పోషకపదార్థాల కారణంగా ప్రతీ ఒక్కరూ గుడ్డు తినడానికి ఇష్టపడతారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు కంపల్సరీగా ఉండేలా చూసుకుంటారు. దీనిలో ఉండే తక్కుఅవ కేలరీలు కొవ్వును తగ్గించి బరువు తగ్గడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఐతే గుడ్డు ఆరోగ్యానికి మంచిదే. కానీ రోజులో ఎన్ని గుడ్లు తినాలి. ఒకరోజులో ఎన్ని గుడ్లు తినవచ్చు. ఎక్కడ ఆపాలి అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం.

పోషకాహార నిపుణుల ప్రకారం గుడ్డులో 200మిల్లీ గ్రాముల కొవ్వు ఉంటుందట. ఆ కొవ్వు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదట. అందువల్ల గుండెపై భారం పడదు. అదీగాక విటమిన్ ఏ, డీ, బయోటెన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్లే గుడ్డుని తమ డైట్ లో భాగంగా చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు.

రోజులో ఎన్ని గుడ్లు తినాలి.

ఐతే గుడ్డు ఎంత ఆరోగ్యకరమే అయినా అతిగా తీసుకోవడం సరికాదు. డైట్ పాటించేవాళ్ళు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. రోజులో 1లేదా 2గుడ్లు మాత్రమే తినాలట. అది మాత్రమే ఆరోగ్యానికి బాగా పనిచేస్తుందట. అతి సర్వత్రా వర్జయేత్ అన్న పదం ఇక్కడ కూడా వర్తిస్తుందన్నమాట.

ఎక్కువ గుడ్లు తింటే ఏమవుతుంది..

ఎక్కువ గుడ్లు తినడం వల్ల శరీరంపై నెగెటివ్ ప్రభావం పడనుంది. గుడ్డులో ఉండే అధిక ప్రోటీన్ వల్ల కిడ్నీలపై ఎక్కువ భారం పడుతుంది. అందుకే ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తినాలి. ఏది ఏమైనా గుడ్డుని మీ డైట్ లో భాగంగా తీసుకోవాలని అనుకున్నప్పుడు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news