కరోనాకు మరో వ్యాక్సిన్‌ రెడీ.. హ్యూమన్‌ ట్రయల్స్‌ సక్సెస్‌..

-

కరోనా మహమ్మారికి గాను దేశీయ డ్రగ్‌ తయారీదారు భారత్‌ బయోటెక్‌ కోవాక్సిన్‌ అనబడే వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ ప్రిలిమినరీ ఫలితాలు ఆశాజనకంగా రావడంతో ఆ కంపెనీ ఫేజ్‌ 1, 2 హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందింది. దీంతో ఈ నెలలో ఆ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఇక అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ ఫైజర్‌, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ ఫార్మా సంస్థలు కలిసి రూపొందించిన మరో కరోనా వ్యాక్సిన్‌ మొదటి దశ హ్యూమన్‌ ట్రయల్స్‌లో సత్ఫలితాలను ఇచ్చింది.

BioNTech and Pfizer developed new corona vaccine

బీఎన్‌టీ162బి1 పేరిట ఆ రెండు కంపెనీలు కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను రెండు గ్రూపులుగా విభజించబడిన 24 మంది ఆరోగ్యవంతమైన వాలంటీర్లకు రెండు డోసుల్లో ఇచ్చారు. మొదటి గ్రూపుకు రెండు డోసుల వ్యాక్సిన్‌ను రెండు దశల్లో 3 వారాలకు ఒకసారి ఇవ్వగా, రెండో గ్రూప్‌కు ఒకేసారి అధిక పరిమాణంలో డోస్‌ను కేవలం ఒక్కసారి మాత్రమే ఇచ్చారు. ఇక వీరిలో నలుగురికి 3 వారాల అనంతరం స్వల్పంగా జ్వరం మాత్రమే వచ్చిందని, ఇతర ఏ అనారోగ్య సమస్యలు రాలేదని గుర్తించారు. అలాగే డోసుల పరిశీలన కాలపరిమితి ముగిశాక ఆ వాలంటీర్లలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారైందని, కోవిడ్‌ను ఎదుర్కొనగల యాంటీ బాడీలు వారి శరీరాల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అయ్యాయని తేల్చారు. ఇక ఆ రెండు ఫార్మా కంపెనీలు తరువాతి దశ హ్యూమన్‌ ట్రయల్స్ కోసం సిద్ధమవుతున్నాయి.

ఫైజర్‌, బయోఎన్‌టెక్ కంపెనీలు తమ బీఎన్‌టీ162బి1 కోవిడ్‌ వ్యాక్సిన్‌ను రెండో దశలో పరీక్షించడానికి గాను మొత్తం 30వేల మంది వాలంటీర్ల సహాయం తీసుకోనున్నాయి. జూలై చివరి వారంలో ఈ ట్రయల్స్‌ ప్రారంభమై ఫలితాలు ఆగస్టు చివరి వరకు వచ్చే అవకాశం ఉంది. తరువాత ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మొదటి దశలో 100 మిలియన్ల డోసులను సిద్ధం చేయనున్నారు. 2021 చివరి వరకు 1.2 బిలియన్ల డోసులను ఉత్పత్తి చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news